ఘనంగా గోకుల్ నగర్ సదర్ ఉత్సవాలు
హాజరైన ఎంపీలు అనిల్ యాదవ్, కడియం కావ్య ,ఎమ్మెల్యే నాయిని...
వరంగల్ వాయిస్ , హనుమకొండ : హనుమకొండ గోకుల్ నగర్ లో బంక సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళన్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు..
మొదటి సారిగా వరంగల్ లో నిర్వహించడం ప్రత్యేకంగా ఉంది. : నాయిని రాజేందర్ రెడ్డి
సదర్ పండుగ అంటే హైదరాబాద్ గా పేరుగాంచిన వేడుక కానీ ఇప్పుడు వరంగల్ లో మొదటి సారిగా నిర్వహించడం ప్రత్యేకంగా ఉందని అభినందించారు.అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ సోదరా సోదరిమనులు పార్టీలకు అతీతంగా గెలిపించారాని సదర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా యాదవులకు సమూచితస్థానం కల్పించడం జరిగిందని అతి చిన్న వయసులో అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపిన ఘనత కాంగ్రెస్ ...