శాకంబరికి వేళాయే..
భద్రకాళికి పోటెత్తనున్న భక్తులు
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
వరంగల్ వాయిస్, వరంగల్ : మహానగరంలోని సుప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన శాకంబరీ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నారు. శ్రీ భద్రకాళి దేవాలయంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించనున్న శాకంబరి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం తెల్లవారు జామున 3 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం వివిధ రకములైన కూరగాయలతో అమ్మవారికి శాకంభరీ అలంకారము ప్రారంభం కానుంది. అమ్మవారి అలంకారమునకు సుమారు 6 గంటల వ్యవధి పడుతుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకొనేందుకు అవకాశం ఉండదు. అలంకరణను ఉదయం 9 గంటలలోపు పూర్తి చేసేలా పూజారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలంకరణ పూర్తి అయిన తర్వాత శ్రీ భద్రకాళీ అమ్మవారి శాకంభరీ విశ్వరూప దర్శనం ప్రారంభమై రాత్రి వరకు కొనసాగుతుంది. భక్తుల...