Warangalvoice

Cultural

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి| Sundarraj Yadhav
Cultural

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి| Sundarraj Yadhav

కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ వరంగల్ వాయిస్, న్యూజెర్సీ : చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన దసరా వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుందర్ రాజ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... ఖండాంతరాలు దాటి, కనీవినీ ఎరుగని రీతిలో ప్రవాస భారతీయులతో కలిసి దసరా సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. పెద్ద సంఖ్యలో ఎన్నారైలు కుటుంబ సభ్యులతో పాల్గొని శమీ పూజతో పాటు ఆటపాటలతో సందడి చేయడం సంతోషంగా ఉందన్నారు. మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు, తెలుగువారి ఐక్యతతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప వ...
మీ ఆశీర్వాదం కావాలి | CM Revanth Reddy
Cultural, Mulugu, Warangal_TriCites

మీ ఆశీర్వాదం కావాలి | CM Revanth Reddy

నేనేమి మనులు, మాణిక్యాలు అడగడం లేదు మేడారానికి జాతీయ హోదా కల్పించాలి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందుకు కృషి చేయాలి జాతర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుదాం.. వెయ్యేళ్లు శాశ్వతంగా ఉండేలా గ్రానైట్ తో నిర్మిద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కోట్లాదిమంది భక్తులు దర్శించుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కుంభమేళా తరహాలో జాతీయ హోదా కల్పించి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అందుకు రాష్ట్రం నుంచి ప్రాముఖ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలన్నారు. పునర్నిర్మాణంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,...
అన్నింటిలో కన్నా అన్నదానం గొప్పది
Cultural

అన్నింటిలో కన్నా అన్నదానం గొప్పది

వరంగల్ వాయిస్, శాయంపేట : అన్నింటిలో కన్నా అన్నదానం గొప్పది అని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. మండలంలోని నర్సింహులపల్లె  గ్రామంలో చెన్నకేశవర స్వామి గుడిలో గణపత ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం  అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు.  ఈ సందర్భంగా కమిటీ సభ్యులు  మాట్లాడుతూ... అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని, వినాయకుడి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని దేవుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రావు,శ్రీకాంత్ రాజు,కృష్ణ,రాజేందర్, నాగరాజు, కర్ణాకర్,రవీందర్,  రత్నాకర్, నాగరాజు, నరేందర్,రాజు, కృష్ణ  శ్రీను, చంద్రమౌళి,సురేందర్, కృష్ణ , లింగమూర్తి, బిక్షపతి  మల్లయ్య, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు....
విగ్రహ నిర్వాహకులకు అవగాహన సదస్సు
Crime, Cultural

విగ్రహ నిర్వాహకులకు అవగాహన సదస్సు

వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని వివిధ గ్రామాలలోని గణ పతి విగ్రహ నిర్వాహకులతో ఎస్సై అశోక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, విద్యుత్ అనుమతులు సౌండ్ సిస్టం ఏర్పాటు, భద్రత చర్యలు గురించి కమిటీ నిర్వాహకులకు వివరించారు.ఈ సదస్సులో ఏఎస్ఐ,కానిస్టేబుల్,గణపతి విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు....
గణేష్ ఉత్సవ కమిటీలకు విద్యుత్ శాఖ వారి విన్నపం
Cultural, Warangal_TriCites

గణేష్ ఉత్సవ కమిటీలకు విద్యుత్ శాఖ వారి విన్నపం

వరంగల్ వాయిస్,దామెర: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  దామెరమండలంలోని అన్ని గ్రామాల గణేష్ ఉత్సవ కమిటీలకు, యూత్ క్లబ్ నిర్వాహకులకు విద్యుత్ శాఖ సూచనలను తప్పకుండా పాటించవలెనని దామెర  ఏఈ గుర్రం రమేష్ తెలిపారు. వినాయక విగ్రహాలను తీసుకుని వచ్చేటప్పుడు తొందరపడకుండా విద్యుత్ వైర్లను మరియు కేబుల్ వైర్లను గమనించి వాహనంలోనికి ఎక్కించడం దింపడం  చేయవలెను. కేబుల్ ఆపరేటర్లు కేబుల్ వైర్లను వినాయక విగ్రహాలకు తగలకుండా పైకి కట్టవలెను. లేనిచో వాటిని తొలగించడం జరుగుతుందని తెలిపారు. వినాయక మండపాలను విద్యుత్ వైర్ల కింద విద్యుత్ స్తంభాల దగ్గర ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేయరాదని అన్నారు. మండపంలోని విద్యుత్ సౌకర్యం కొరకు ఎన్సీబీ కరెంటు వైర్లను వాడవలెను ఇన్సులేటెడ్ కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ వారి అనుమతితో విద్యుత్ సిబ్బంది ద్వారా పోలుపైన చుట్టించుకోవాలని కొండ్లు వేయరాదని తెలిపారు. వినాయక మండపా...
హనుమకొండలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి  వేడుకలు
Cultural, Hanamkonda

హనుమకొండలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి  వేడుకలు

ఉత్తర తెలంగాణ కేంద్రంగా గొల్లకురుమల సాంస్కృతిక సమ్మేళనం ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. వరంగల్ వాయిస్, హనుమకొండ :జానపద కళాకారుల ప్రదర్శనతో శ్రీకృష్ణుని శోభాయాత్రఉద్యమాల పురిటి గడ్డ ఓరుగల్లులో ‘యాదవ వెల్ఫేర్ ట్రస్ట్-వరంగల్’ వేదికగా కుడా మాజీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉత్తర తెలంగాణ వేదికగా గొల్లకురుమల ఐక్యతను చాటేలా ఈ గొల్లకురుమ సాంస్కృతికం సమ్మేళనాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. జానపద కళాకారుల ప్రదర్శన, మహిళల బోనాలతో హనుమకొండలోని గోకుల్ నగర్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా కాళోజీ కళాక్షేత్రం వరకు వేలమందితో శ్రీ కృష్ణుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.రెండువేల మంది గొల్ల కురుమల యువత ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ వేడుకలకు హర్యా...
అమ్మవారికి తొలిబొనం
Cultural

అమ్మవారికి తొలిబొనం

ఆదివారం కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహణవరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వివిధ రూపాల్లో కొలువై ఉన్న అమ్మవారికి శ్రావణమాసం తొలి ఆదివారం కుమ్మర్లు తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ అమ్మ ఆశీస్సులతో సమాజం సుభిక్షంగా ఉండాలని, ఆ తల్లి చల్లని చూపులు మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ అమ్మకు బోనం సమర్పిస్తారని తెలంగాణ కుమ్మర్ల సంఘం, రాష్ట్ర అధ్యక్షులు బీసీ ఐక్య చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆకారపు మోహన్ అన్నారు. అయితే అమ్మవారికి కుండలోనే బోనం తీసుకురావడం ద్వారా అమ్మ ఆశీస్సులు శీఘ్రంగా లభిస్తాయన్నారు. పోచమ్మ మైదాన్ లోని శ్రీ పోచమ్మ తల్లి కనకదుర్గమ్మ దేవాలయంలో ఆదివారం కుమ్మర భక్తమండలి కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు....
ఘనంగా నాగుల పంచమి
Cultural, Warangal_TriCites

ఘనంగా నాగుల పంచమి

ఉర్సు నాగమయ్య గుడికి పోటెత్తిన భక్తులు జిల్లా వ్యాప్తంగా వేడుకలు వరంగల్ వాయిస్, కరీమాబాద్ : నాగుల పంచమి సందర్భంగా ఉర్సు నాగమయ్య గుడికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలి క్యూ కట్టారు. జంట నాగులకు పాలుపోసి భక్తి పారవశ్యలో మునిగితేలారు. కోరిన కోర్కెలు నెరవేర్చుతూ భక్తుల కొంగు భంగారంగా వెలుగొందుతున్న నాగమయ్య దర్శనానికి రెండు, మూడు గంటలపాటు క్యూలైన్లలోనే వేచి ఉన్నారు. భక్తుల రాకను ముందుగానే గుర్తించిన ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలరు. మిల్స్ కాలనీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలో.. నాగుల పంచమి సందర్భంగా నర్సంపేట్ రోడ్ లోని శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలోని నాగేంద్ర స్వామికి పాలు పోసి మొక్కులు సమర్పించుకున్నారు. కనకదుర్గ దేవాలయ కమిటీ అధ్యక్షులు మీసాల ప్రకాష్ భక్తులకు ఎలాంటి అసౌ...
శక్తి స్వరూపిణి.. శాకంబరీ
Cultural, Latest News, Today_banner, Warangal_TriCites

శక్తి స్వరూపిణి.. శాకంబరీ

కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారి దర్శనం పది టన్నుల కూరగాయలు, ఆకు కూరలతో అలంకరణ పులకించిన భక్తజనం ఆలయానికి పోటెత్తిన భక్తులు కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సురేఖ పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు 300మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన భద్రకాళి అమ్మవారి ఆషాడ మాస శాకంబరీ ఉత్సవాలను గురువారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు జరిగే శాకంబరీ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. పదిహేను రోజులపాటు ఉదయం, సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులను వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేశారు. చివరి రోజైన ఆషాఢ శుద్ధపౌర్ణమి అయిన గురుపౌర్ణమి పర్వదినాన అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో శాకంబరీగా అలంకరించారు. భద్రకాళి ఆలయానికి ఉదయం 10 గంటలకు చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వ...
బాబా గుడిలో భక్తజనం
Cultural, Latest News

బాబా గుడిలో భక్తజనం

గురు పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు శేజ హారతితో ముగిసిన పూజా కార్యక్రమాలు వరంగల్ వాయిస్, హనుమకొండ : మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి మనకు తోడు, నీడై నిలిచి మనల్ని సన్మార్గంలో నడిపించే గురువులను పూజించి వారిని గౌరవించుకునే రోజే ‘గురు పౌర్ణమి’ అని హనుమకొండలోని సాయిబాబా మందిర చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ అన్నారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పూజారులు కిషోర్ శర్మ, మణిశర్మ, చందులు మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని తల్లిదండ్రులతో కలిసి బాబా దర్శనం చేసుకున్నారు. ఆమెకు మందిర చైర్మన్ శేష వస్త్రాలలు అందజేసి ఘనంగా సత్కరించారు. నగర ట్రాఫిక్ ఏసీపీ తీర్థాల సత్యనారాయణ, సుబేదారి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ తదితరులు పూజా కార్యక...