వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోపిడీ
ఇద్దరు దొంగల అరెస్ట్
నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి ఆమె ఒంటిమీద ఉన్న బంగారాన్ని చోరీ చేసిన ఇద్దరు నిందితులను సీసీఎస్, మీల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి పోలీసులు లక్ష పదివేల రూపాయల విలువ గల బంగారు ఆభరణంతో పాటు ద్విచక్రవాహనం, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించిన వివరాలను శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించారు. వరంగల్ నగరంలోని బి.ఆర్ నగర్ కు చెందిన అజారుద్దీన్, ఓరుగంటి రాజు ఒకే ప్రాంతానికి చెందిన వారు. ఇద్దరు బాల్య స్నేహితులు. ఇద్దరూ చదువు మధ్యలో అపివేసి ఎలక్ట్రిషన్ గా పనిచేసేవారు. దీని ద్వారా వీరికి వచ్చే అదాయంతో పాటు అప్పులు చేసి మద్యం తాగుతూ, జల్సాలు చేసేవారు. దీంతో వీరికి అప్పులు అధికం కావడంతో పాటు వీరి జల్సాలకు డబ్బు లభించకపోవడంతో సులువు డబ్బు సంపాదించాలకున్నారు. ఇందులో భాగం వీరి ప్రాంతంలోనే ఒంటరి నివసిస్తున్న వృద్ధురాల...



