కాస్ట్ లీ బైక్ కనబడితే దోచేస్తారు..
ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్రూ.13లక్షల విలువ చేసే బైక్ ల స్వాధీనంవివరాలు వెల్లడించిన తరుణ్ జోషి
వరంగల్ వాయిస్, క్రైం: అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను శనివారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 13 లక్షల విలువ గల ఎనిమిది ఖరీదైన ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతానికి చెందిన షిండే జితేందర్, షిండే అశోక్ తో పాటు హనుమకొండ జిల్లా పద్మాక్షీ ప్రాంతానికి చెందిన షిండే ఈశ్వర్ ముగ్గురు వరుసకు అన్నాదమ్ములు కావడంతో వీరు తరుచుగా కలుసుకునేవారు. ఇదే సమయంలో నిందితులు ముగ్గురు కలిసి మద్యం తాగడంతో పాటు జల్సాలు చేసేవారు. దీంతో వీరు చేసే చిన్న చిన్న పనుల కారణంగా వీరికి వచ్చే అదాయం వీరి జల్సాల...