256కిలోల గంజాయి స్వాధీనం
ముగ్గురు నిందితుల అరెస్ట్
వరంగల్ వాయిస్, క్రైం: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ , హసన్ పర్తి పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 38 లక్షల రూపాయల విలువగల గంజాయితో పాటు గంజాయి తరలిస్తున్న కారును, ఒక మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సోమవారం వెల్లడించారు.. కామారెడ్డి జిల్లాకి చెందిన పల్లపు రాజు , పల్లపు రాజు, బోడ సుమన్ అనే ముగ్గురు 4 సంవత్సరాలుగా భద్రాచలం, డొంకరాయి, సీలేరు, ధారకొండ ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలలో వారి ట్రాక్టర్ తో భూమిని చదును చేసేందుకు పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం జనవరిలో సత్తి బాబుకి చెందిన భూమి అల్లురికోట ఒడిషా రాష్ట్రంలో రూ.70,000 లకు కుదుర్చుకొని అతడి భూమిని చదును చేశారు. ...