Warangalvoice

Crime

ఈతకు వెళ్లిన ఇద్దరు బాలుర గల్లంతు
Crime, District News, Hanamkonda

ఈతకు వెళ్లిన ఇద్దరు బాలుర గల్లంతు

ఒకరిని కాపాడిన స్థానికులు వరంగల్ వాయిస్, హనుమకొండ : గుండ్ల సింగారం కేనాల్ లో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. సెయింట్ తామస్ స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్న చరణ్, విగ్నేశ్వర్ సోమవారం సాయంత్రం గుండ్ల సింగారం కేనాల్ లో ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన వీరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిని యాదవ్ నగర్ సమీపంలో స్థానికులు గుర్తించి తాడు సహాయంతో రక్షించే ప్రయత్నం చేశారు. అయితే చరణ్ మాత్రం తాడు సహాయంతో ఒడ్డుకు చేరుకోగా విగ్నేశ్వర్ కెనాల్ లో కొట్టుకు పోయినట్లు స్థానికులు వెల్లడించారు....
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు
Crime, District News, Warangal

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు

భార్యభర్తల మృతి వరంగల్ వాయిస్, పరకాల : నడి కూడ మండలం ధర్మారం గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం 6.30గంటల సమయంలో హనుమకొండ నుంచి పరకాలకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని పరకాలకే వస్తున్న కారు మితిమీరిన వేగంతో ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న పరకాల పట్టణ కేంద్రానికి చెందిన భార్య, భర్తల్లో భర్త పసుల మొగిలి (55) అక్కడికక్కడే మృతి చెందాగా భార్య సావిత్రికి (50) తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పరకాల ఎస్ఐ శివకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మొగిలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల తరలించారు. కారు డ్రైవర్ తోపాటు యజమాని పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు....
ఈ దశాబ్దపు అతిపెద్ద రైలు ప్రమాదం
Crime, District News, Latest News

ఈ దశాబ్దపు అతిపెద్ద రైలు ప్రమాదం

మూడు వందలకు పైగా మృతులు వేయికి పైగా క్షతగాత్రులు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని, సిఎం నవీన్‌ పట్నాయక్‌ మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ/బాలాసోర్‌ : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదమే ఈ దశాబ్ద కాలంలో జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదంగా భావిస్తున్నారు. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైల్లు ఢీకొన్న ఘటనలో 300మందికి పైగా మృతి చెందగా, వేయికి పైగా క్షతగాత్రులయ్యారు. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841) శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి సమీపంలో పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొంది. ఈ ఘటనలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమండల్‌ రైలు బోగీలపై యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ దూసుకెళ్లింది. ఘటనలో యశ్వంత్‌పూర్‌ ఎక్స...
ప్రీతిది ఆత్మహత్యే- వరంగల్ సీపీ రంగనాథ్
Crime, District News, Warangal

ప్రీతిది ఆత్మహత్యే- వరంగల్ సీపీ రంగనాథ్

వరంగల్ వాయిస్, క్రైం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థిని ప్రీతి నాయక్ ది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. అయితే ఆమె ఆత్మహత్యకు సైఫ్ ప్రధాన కారణమన్నారు. ప్రీతి పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడైనట్లు ఆయన తెలిపారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో ఇంజెక్షన్ దొరికిందని, కానీ నీడిల్ దొరకలేదన్నారు. వారం పది రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జీ షీటును దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం కేఎంసీలో ప్రీతి ఆత్మహత్య ఘటన సంచలనం కలిగించింది. ఇదిలా ఉంటే ప్రతీ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ కు కోర్టును నిన్ననే బెయిల్ మంజూరు చేసింది....
బస్టాండులో డ్రైవర్‌ నిర్లక్ష్యం
Crime, District News, Warangal

బస్టాండులో డ్రైవర్‌ నిర్లక్ష్యం

బస్సు ఢీకొనడంతో విద్యార్థి మృతి బస్సు అద్దాలు ధ్వంసం చేసిన తోటి విద్యార్థులు వరంగల్ వాయిస్, వరంగల్‌ : వరంగల్‌ బస్టాండ్‌ లో డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. విద్యార్థిని బస్సు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మిగతా స్టూడెంట్స్‌ బస్టాండులోనే ఉన్న నాలుగు బస్సుల అద్వాలను ధ్వంసం చేశారు. వీరితో పాటు ప్రయాణికులు కూడా ఆందోళనకు దిగారు. తన స్నేహితుడిని బస్సు ఎక్కించడానికి చింతా అనిల్‌ అనే విద్యార్థి వరంగల్‌ బస్‌ స్టాండ్‌ కు వెళ్లాడు. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు.. అనిల్‌ ను ఢీ కొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన ప్రయాణికులు, విద్యార్థులు నాలుగు బస్సుల అద్దాలను కోపంతో ధ్వంసం చేశారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనిల్‌ మ...
సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నిరూపిస్తే, నేను ఉద్యోగం వదిలేసి పోతా
Crime, District News, Hanamkonda, Warangal

సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నిరూపిస్తే, నేను ఉద్యోగం వదిలేసి పోతా

-వరంగల్ పోలీస్ కమిషనర్ పి.వి. రంగనాథ్ వరంగల్ వాయిస్, క్రైం:  నేను సెటిల్ మెంట్లకు పాల్పడినట్లుగా నిరూపిస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతానని యం.పి బండి సంజయ్ కుమార్ వ్యాక్యలకు కౌంటర్ ఇచ్చారు వరంగల్ పోలీస్ కమిషనర్, నిన్నటి రోజున మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పై బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాక్యల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నన్ను లక్ష్యంగా చేసుకోని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసారు. నాపై ఇంతకాలం ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయలేదు. గతంలో నల్గొండ, ఖమ్మంతో పాటు ప్రస్తుతంలో వరంగల్ కూడ బిజేపి, బిఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీకి చెందిన ఎంతో మంది నాయకులను అరెస్ట్ అయ్యారు. అప్పుడు చేయనటువంటి ఆరోపణలు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్ అయినందుకు నాపై ఉక్రోషంతో ఆరోపణలు చేసినట్లు వుందని. కొన్ని ప్రాంతాల్...
అసాంఘీక శక్తులకు దూరంగా ఉండాలి
Bhupalapally, Crime, District News

అసాంఘీక శక్తులకు దూరంగా ఉండాలి

గొత్తికోయ గూడేన్ని సందర్శించిన డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి వరంగల్‌ వాయిస్, మహాముత్తారం : సమాజ శ్రేయస్సుకు హాని కలిగించే చట్ట వ్యతిరేక శక్తులకు దూరంగా ఉండాలని కాటారం డీఎస్పీ గడ్డం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని మద్దిమడుగు గొత్తికోయ గూడేన్ని కాటారం సీఐ రంజిత్‌రావుతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూడేంలో ఎవరైన కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీస్‌లకు సమాచారం అందించాలన్నారు. చట్టవ్యతిరేక సిద్ధాంతాలతో అడవుల్లో ఉండే మావోయిస్టులకు సహకరించొద్దని సూచించారు. గూడెంలోని పిల్లలను తప్పకుండా బడికి పంపించి విద్యానందించాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా పోలీసుల తమ దృష్టికి తీసుకురావాలని, చట్టపరిధిలో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గూడెం వాసుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం ఎస్సై సుధాకర్, సివిల్, సీఆర్‌పీఎఫ్‌ ...
రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
Crime, District News

రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉప్పల్ - భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద క్షేత్రస్థాయి పరిశీలన వరంగల్ వాయిస్ , క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం వెల్లడించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల కాలంలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా భీంపల్లి క్రాస్ రోడ్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, ఆర్అండ్ బీ , స్థానిక ప్రజా ప్రతినిధులతో కల్సి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సి చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడంతో పాటు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వాహనాల వేగాన్ని తగ్గించేందుకుగాను స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, స...
యూట్యూబ్ లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి
Crime, District News, Telangana

యూట్యూబ్ లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి

దొంగనోట్ల ముఠా అరెస్ట్ నిందితులంతా ఉమ్మడి జిల్లా వారే వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సహాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రెండు వేల రూపాయల నోట్లు మూడు వందలు (ఆరులక్షలు), కలర్ ప్రింటర్, ఏడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారీ అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన సయ్యద్ యాకుబ్ ఆలియాస్ షకీల్ (ప్రధాన నిందితుడు), న్యూరాయపురకు చెందిన యం.డి సమీర్ (ప్రస్తుతం పరారీలో వున్నాడు), పెద్దమ్మగడ్డకు చెందిన పేరాల అవినాష్, నర్సంపేటకు చెందిన కత్తి రమేష్, మచిలీబజార్ కు చెందిన యం.డి అక్రం ఆలీ, కాజీపేటకు చెందిన గడ్డం ప్రవీణ్, గుండ్...
బావిలోకి దూసుకెళ్లిన కారు
Crime, District News, Mahabubabad

బావిలోకి దూసుకెళ్లిన కారు

ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి వ‌రంగ‌ల్ వాయిస్‌, కేస‌ముద్రం : దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తున్న కారు శుక్ర‌వారం రాత్రి ఆరున్న‌ర గంట‌ల ప్రాంతంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కేస‌ముద్రం బైపాస్ రోడ్డు వెంట ఉన్న బావిలోకి దూసుకెళ్ల‌డంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ముగ్గురు కారులోనే చిక్కుకున్నారు. ఇందులో చిన్నారి పాప కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. టేకుల గూడెంనుంచి అన్నారం ష‌రీఫ్‌కు కారులో ఐదుగురు బ‌య‌లు దేరారు. తిరిగి వ‌చ్చే క్ర‌మంలో హ‌హ‌బూబాబాద్‌కు చెందిన మ‌రో ఇద్ద‌రు వీరితో క‌లిశారు. మొత్తం ఏడుగురితో అన్నారం ష‌రీఫ్‌లో బ‌య‌లు దేరిక కారు కేస‌ముద్రం బైపాస్ రోడ్డులో ప్ర‌మాదానికి గుర‌యింది. అయితే కారులో భ‌ద్రుతోపాటు చిన్నారి, మ‌రోక‌రు ఉండ‌గా, అచాలితోపాటు మ‌రో మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ ప్ర‌మాదానికి సంబందించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.  ...