Warangalvoice

Crime

మెడలోని పుస్తెల తాడు అపహరణ
Crime, Mahabubabad

మెడలోని పుస్తెల తాడు అపహరణ

జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : ఓ మహిళ తన ఇంటి ముందు మనువడిని అడిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోంచి పుస్తెల తాడు, ఇతర బంగారు గొలుసును అపహరించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. కృష్ణ కాలనీ చెందిన మంగళంపల్లి సోమలక్ష్మి తన మనువడిని ఇంటి ముందు ఆడిగిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోంచి నాలుగున్నర తులాల బంగారు పుస్తేల తాడు, బంగారు గొలుసు అపహరించుక పోయాడు. మహిళ, దుండగుడి మధ్య జరిగిన పెనుగులాటలో అర తులం వరకు గొలుసు ఆమె చేతిలోకి రాగా మిగిళిన 4.5 తులాలు బంగారు ఆభరణాలు అపహరించుకు పోయాడు. పెనుగులాటలో మెడపై స్వల్ప గాయాలయ్యాయి. నిత్యం జన సంచారం అధికంగా ఉండే కృష్ణ కాలనీలో దుండగుడు మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలు అపహరించకపోవడం సంచలనం సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరు...
వారెవ్వ.. తగ్గేదే లే పుష్ప.. పుష్పరాజ్
Crime, District News

వారెవ్వ.. తగ్గేదే లే పుష్ప.. పుష్పరాజ్

సినిమా లెవెలెల్లో గంజాయి స్మగ్లింగ్ గంజాయి స్మగ్లర్ అరెస్ట్ భారీగా పట్టుబడిన గంజాయి యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసుల చొరవ రూ.85 లక్షల విలువ గల 338 కిలోల గంజాయి, ట్రాక్టర్  పోలీసులు స్వాధీనం పోలీస్ సిబ్బందిని ప్రశంసించిన సిపి అంబర్ కిషోర్ షా వరంగల్ వాయిస్, క్రైం : అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమా దేశవ్యాప్తంగా ఎంత హిట్ అయిందో మనందరికి తెలిసిందే.. అందులో  ఎర్ర చెందనం చెక్కల అక్రమ రవాణా ఎలా చేయవచ్చో.. అటవీ అధికారుల కళ్లు గప్పి స్మగ్లింగ్ ఎలా చేయాలో తెలివిగా పోలీసులను ఎలా బురిడీ కొట్టించవచ్చో చాల చక్కగా చూపించారు. బహుషా ఆ సీనిమాను స్పూర్తగా తీసుకున్నట్టున్నారు ఈ గంజా అక్రమ రవాణా దారులు. మొత్తం సినిమాలో చూపించి నట్టుగా ట్రాక్టర్ లో స్మగ్లింగ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాకు పాలు పాడుతున్న ఓ ముఠా తాజా పోలీసులకు పట్టు పడ్డారు.. పోలీసులు తెలిపిని వివరాల ...
నిమజ్జన వేళ ట్రాఫిక్ ఆంక్షలు
Crime, District News

నిమజ్జన వేళ ట్రాఫిక్ ఆంక్షలు

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటి పరిధిలో వినాయక నిమజ్జనం సందర్బంగా నగరంలో శోభాయాత్ర నిర్వహించబడుతుంది. కాబట్టి నగరంలో పెద్ద స్థాయిలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రై సిటి పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా రేపు అనగా 16-09-2024 మధ్యాహ్నం 12.00 నుండి మరుసటి రోజు తేది 17-09-2024 ఉదయం 10.00 గంటల వరకు ట్రాఫిక్  ఆంక్షలు కోనసాగుతాయి. భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు.. 1.ములుగు,భూపాలపల్లి వైపు నుంచి వచ్చు భారీ వాహనాలు హైదరాబాద్ కు వెళ్ళవలసినవి ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వెళ్లాలి. భూపాలపల్లి పరకాల నుంచి ఖమ్మం వెళ్లవలసినవి ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కరుణాపురం, మడికొండ, కడిపి...
గోవర్ధనగిరిలో యువకుడి ఆత్మహత్య
Crime

గోవర్ధనగిరిలో యువకుడి ఆత్మహత్య

వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో గల దర్గా సమీపంలో గురువారం ఉదయం యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన బర్ల హరీష్ (35)అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేవాన్ని జనగామ ఏరియా హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.  ...
వాహనం నడిపిన మైనర్లపై కేసు
Crime, District News

వాహనం నడిపిన మైనర్లపై కేసు

జువైనల్ హోమ్ కు తరలింపు వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు నడిపిన 8 మంది మైనర్లను గుర్తించి శుక్రవారం జువైనల్ కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేయగా, వీరికి రెండు రోజులు బాలల అబ్జర్వేషన్ హోం కు పంపినట్లు మట్టేవాడ సీఐ కె.శ్రీధర్ తెలిపారు. పోచమ్మ మైదాన్, ఎంజీఎం సెంటర్, పోతన రోడ్డు, బట్టల బజార్, హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లలో వాహనాలు నడుపుతున్న మైనర్ లను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో తమ వాహనాలను మైనర్లు ఇవ్వొద్దన్నారు. మైనర్లు రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే శిక్ష తప్పదని హెచ్చరించారు....
అత్తను తుపాకీతో కాల్చిన అల్లుడు
Crime, District News, Hanamkonda, Latest News

అత్తను తుపాకీతో కాల్చిన అల్లుడు

అక్కడికక్కడే మృతి వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆదప్రసాద్ గురువారం హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం ప్రాంతానికి చెందిన తన అత్త కోమలను సర్విస్ రివాల్వర్ తో కాల్చి చంపాడు. స్థానికులకు కథనం ప్రకారం.. ప్రసాద్ కు ఇవ్వవలసిన రూ.4 లక్షల విషయంలో గత కొంత కాలంగా అత్తా, అల్లుడి మధ్య వివాదం జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం డబ్బుల విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన ప్రసాద్ తన సర్విస్ రివాల్వర్ తో అత్తపై కాల్పులు జరుపగా అమె అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీస్ ఇన్ స్పెక్టర్ అబ్బయ్య నేతృత్వంలో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు....
ప్లాష్..ప్లాష్..  వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ
Crime, District News, Hanamkonda, Latest News, Warangal

ప్లాష్..ప్లాష్.. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోని నలుగురు డీఈఓలను కూడా బదిలీ చేశారు....
బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష
Crime, District News, Mahabubabad, Viral News

బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష

మహబూబాబాద్ కోర్టు సంచలన తీర్పు మూడేళ్ల క్రితం ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ లో మూడేళ్ల క్రితం తొమ్మిది సంవత్సరాల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్ కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జిల్లా కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు న్యాయ దేవత, పోలీసుల చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే..మహబూబాబాద్ పట్టణంలోని కృష్ణ కాలనీలో నివాసముంటున్న జర్నలిస్ట్ కుసుమ రంజిత్ రెడ్డి-వసంత దంపతులు కుమారుడైన దీక్షిత్ రెడ్డి 18 అక్టోబర్ 2020 సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ స్థానికంగా ఉంటూ ఆటో మొబైల్ షాప్ నడుపుకుంటున్నాడు. ఆర్థికంగా ఉన్న దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని కుట్ర పన్నిన మంద సాగర్ ఆయ...
పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు
Crime, District News, Hanamkonda

పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు

నూతన గణేష్ మండపాల సమాచారాన్ని ఇవ్వండి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ వరంగల్ వాయిస్, వరంగల్ : మన పండుగలు మతసామరస్యానికి ప్రతీకలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. రానున్న వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగలను పురస్కరించుకొని సెంట్రల్ జోన్ పోలీసుల అధ్వర్యంలో శాంతి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్ లో నిర్వహించారు. ట్రై సీటీ పరిధిలోని వివిధ మతాలకు చెందిన మత పెద్దలతో పాటు, గణేష్ నవరాత్రి మండళ్ళ నిర్వహకులు పాల్గొన్న ఈ సామవేశానికి సీపీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గతంలో ఎన్నడు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని. ఇదే సంస్కృతిని కోనసాగిస్తూ ఈ సారి కూడా శాంతియుతంగా పండుగలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలు సహకరించాలన్నారు. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారుల...
లారీ ఢీకొని యువకుడి మృతి
Crime, District News

లారీ ఢీకొని యువకుడి మృతి

వరంగల్ వాయిస్, మల్హర్ : లారీ ఢీ కొని యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం మల్హర్ మండలంలోని నాగులమ్మ క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని అన్సాన్ పల్లి గ్రామానికి చెందిన అజ్మీరా శ్రీనివాస్(18) గురువారం అడ్వాలపల్లి లంబాడీ తాండాలోని తమ బందువుల ఇంట్లో జరుగుతున్న తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడానికి తన బైక్ పై బయలుదేరారు. మండలంలోని నాగులమ్మ క్రాస్ రోడ్ నుంచి మల్లారం మధ్యలో తాడిచెర్ల వైపు వేగంగా వెళ్తున్న బొగ్గు టిప్పర్ ముందు ఉన్న లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో టిప్పర్ ముందు భాగంలో గల బంపర్ బైక్ పై వెళ్తున్న శ్రీనివాస్ కి తగిలి కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన అక్కడికక్కడే మృతి చెందారు. యువకుడి మృతితో అన్సాన్ పల్లి, అడ్వాల పల్లి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్, కాటారం సీఐ రంజిత్ రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేప...