సైలెన్సర్లు మార్చితే క్రిమినల్ చర్యలు
ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు
వరంగల్ వాయిస్, క్రైం : ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లలో ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మెకానికిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు హెచ్చరించారు. మంగళవారం కేయూసీ జంక్షన్ ప్రాంతంలో పలు ద్విచక్రవాహన సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత మూడు నెలల కాలంలో ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు విరుద్ధంగా అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుంచి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించాడంతో పాటు వ...









