Warangalvoice

Crime

కొండా సురేఖపై క్రిమినల్ కేసు ఫైల్ చేయండి
Crime, Political

కొండా సురేఖపై క్రిమినల్ కేసు ఫైల్ చేయండి

పోలీసులకు సూచించిన నాంపల్లి కోర్టు ఈ నెల 21 వరకు టైం.. మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం కేసులో సంచలన తీర్పు వరంగల్ వాయిస్, వరంగల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టు శనివారం పోలీసులను ఆదేశించింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో కొండా సురేఖపై ఈ నెల 21 లోగా నోటీసు జారీ చేయాలని కోర్టు సూచించింది. కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారణమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఫిర్యాదుతోపాటు సాక్ష్యుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్ల పరిశీలించిన తర్వాత, నిందితురాలు కొండా సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్టు కోర్టు గుర్తించింది. ఇక కొండా సరేఖ తరుపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. కేటీఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచార...
బాలుడి గొంతు కోసిన దుండగులు
Crime

బాలుడి గొంతు కోసిన దుండగులు

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న ఏడేళ్ల బాలుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన చెందిన ఉపేందర్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించారు. ఈ క్రమంలో తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో తండ్రితో కలిసి నిద్రిస్తున్న ఉపేందర్ కుమారుడిపై దుండగులు కత్తితో దాడి చేసి మెడను కోసి అక్కడినుంచి పరారయ్యారు. దీన్ని గమనించిన బాలుడి నానమ్మ ఇంట్లో వారిని నిద్ర లేపారు. రక్తస్రావం అవుతున్న బాలుడిని స్థానిక వైద్యుడి వద్ద ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు ప్రమాదం లేదని తెలిపారు. ఈ దంపతుల చిన్న కుమారు...
అమ్మ బాబోయ్.. 120 చలాన్లు..!
Crime, Warangal_TriCites

అమ్మ బాబోయ్.. 120 చలాన్లు..!

ద్విచక్ర వాహనం స్వాధీనంవరంగల్ వాయిస్, కాజీపేట : వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకన్న తన సిబ్బందితో కలిసి బుధవారం కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలు చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన వాహనదారుడి ద్విచక్రవాహనానికి సంబంధించిన వివరాలను పరిశీలించగా ఏకంగా 120 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ అధికారులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. ఈ చలాన్ల మొత్తం రూ.32,165 కావడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జరిమానా మొత్తం చెల్లిస్తేనే వాహనం రిలీజ్ చేయనున్నట్లు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకన్న చెప్పారు....
సర్టిఫికేట్ల తయారీ ముఠా అరెస్ట్
Crime, Warangal_TriCites

సర్టిఫికేట్ల తయారీ ముఠా అరెస్ట్

పోలీసుల అదుపులో 15 మంది పరారీలో మరో ఐదుగురు వివరాలు వెల్లడించిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి వరంగల్ వాయిస్, క్రైం : రెండు వేర్వేరు సంఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగిస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ సర్టిఫికేట్లను తయారు చేసున్న రెండు ముఠాలకు సంబంధించిన 15 మంది కేటుగాళ్లను టాస్క్ ఫోర్స్, హనుమకొండ, మిల్స్ కాలనీ, కేయూసీ పోలీసులు, ఆర్టీఏ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా తెలిపారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల నుంచి ఆరు డెస్క్ టాప్ కంప్యూటర్లు, రెండు ల్యాప్ టాప్ లు, రెండు థర్మల్ ప్రింటర్స్, 17 సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్ చిఫ్ తో కూడిన పీవీసీ కార్డులు, కార్డు ప్రింటింగ్ కు అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీస...
ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి…..వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌
Crime

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి…..వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం: ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ నెక్కొండ పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం నెక్కొండ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ తో పాటు కిట్‌ ఆర్టికల్స్‌ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌, సిసిటిఎన్‌ఎస్‌ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్‌ సిబ్బందిని సిపి అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్‌ కమి...
ఫ్లాష్.. ఫ్లాష్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్ స్పెక్టర్ల బదిలీ
Crime, Warangal_TriCites

ఫ్లాష్.. ఫ్లాష్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్ స్పెక్టర్ల బదిలీ

వరంగల్ వాయిస్, క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో  ఎన్.కరుణాకర్ సిసిఆర్బి నుండి మట్టెవాడ పోలీస్ స్టేషన్, టి. గోపి మట్టెవాడ నుండి వి. ఆర్, కె. సుజాత షీ టీం నుండి వరంగల్ ట్రాఫిక్, కె. రామకృష్ణ వరంగల్ ట్రాఫిక్ నునుండి వి. ఆర్ కు బదిలి అయ్యారు....
వైద్యురాలు మృతి కేసులో నలుగురు అరెస్ట్
Crime, Latest News, Warangal_TriCites

వైద్యురాలు మృతి కేసులో నలుగురు అరెస్ట్

వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వరంగల్ వాయిస్, హసన్ పర్తి : యువ వైద్యురాలు అల్లాడి ప్రత్యూష ఆత్మ హత్యకు కారకులైన నలుగురిని హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని కాకతీయ వెంటేజ్ లోని స్వగృహంలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు. డాక్టర్ ప్రత్యూష మృతికి కారకులైన భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అతని తల్లితండ్రులు అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతితోపాటు బానోతు శృతి కారులో హనుమకొండ-కరీంనగర్ ప్రధాన రహదారిలో వెళ్లుండగా కాకతీయ వెంటేజ్ క్రాస్ సమీపంలో హసన్ పర్తి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మాటలతో ప్రేరేపించి డాక్టర్ ప్రత్యూష...
డాక్టర్స్ కాపురంలో రీల్స్ చిచ్చు
Crime, Warangal_TriCites

డాక్టర్స్ కాపురంలో రీల్స్ చిచ్చు

‘బుట్ట బొమ్మ’పరిచయంతో కుటుంబంలో కలహాలు మనస్థాపంతో భార్య ప్రత్యూష ఆత్మహత్య నలుగురిపై కేసు నమోదు వరంగల్ వాయిస్, హసన్ పర్తి : ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న డాక్టర్స్ కాపురంలోకి బుట్ట బొమ్మ పేరుతో మరో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో.. పచ్చని కాపురంలో కలహాలు రేగాయి. భర్త ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని అనుమానించి భార్య.. అతనితో వాదనలకు దిగింది. అయిన ఆయనలో మార్పు కనిపించకపోవడంతో ఆత్మహత్యతో తనువు చాలించింది. ఈ దారుణం ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో చోటుచేసుకుంది. డాక్టర్ ప్రత్యూష బందువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూషకు కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లాడి సుజన్ తో 2017లో వివాహమైంది. వీరికి ఏడు సంవత్సరాల జానుషా సృజన్, ఏడు నెలల జెస్వికాస్ సృజన్ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. డాక్టర్ ప్రత్యూష ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ లో డెంటింస్ట్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ సృజన్ ...
తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
Crime, Latest News

తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

వరంగల్ వాయిస్, సుబేదారి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తాడిచర్ల మండలానికి చెందిన ఉల్లిగంటి సంపత్ కుమార్తె, 9 సంవత్సరాల శ్రీ నిత్య, హనుమకొండ హంటర్‌రోడ్‌లోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో 5వ తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిత్య హాస్టల్ నుంచి అకస్మాత్తుగా బయటకు వెళ్లిపోయింది. అదే హాస్టల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బైరి ఉమా బాలిక కనిపించడం లేదని గుర్తించి ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సుబేదారి ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ కు తెలియజేశారు. ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ తన సిబ్బందితో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించగా, బాలిక పద్మాక్షమ్మ గుట్ట దగ్గర ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు నిత్యను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా శ్రీ నిత్య తల్లిదండ్రులు సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్‌కు ప్రత్యేక ధన్...
సైలెన్సర్లు మార్చితే క్రిమినల్‌ చర్యలు
Crime

సైలెన్సర్లు మార్చితే క్రిమినల్‌ చర్యలు

ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు వరంగల్ వాయిస్, క్రైం : ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లలో ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మెకానికిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వరంగల్‌ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు హెచ్చరించారు. మంగళవారం కేయూసీ జంక్షన్‌ ప్రాంతంలో పలు ద్విచక్రవాహన సైలెన్సర్లను రోడ్‌ రోలర్‌తో ధ్వంసం చేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ అదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్‌ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్‌ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత మూడు నెలల కాలంలో ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు విరుద్ధంగా అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుంచి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్‌ పోలీసులు తొలగించాడంతో పాటు వ...