హార్ట్ ఎటాక్ తో మరో గెస్ట్ లెక్చరర్ మృతి
* 12 నెలలు అయినా అందని వేతనాలు* ఆర్థిక అవస్థలతోనే ఆగుతున్న గెస్ట్ గుండెలు* ఆగం అవుతున్న అతిథి అధ్యాపకుల కుటుంబాలు
వరంగల్ వాయిస్, హనుమకొండ : గత 15 రోజుల్లోనే హార్ట్ ఎటాక్ తో ముగ్గురు గెస్ట్ లెక్చరర్లు మరణించారు.గత రెండేళ్లలో దాదాపుగా 8 మంది మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన క్యాతం రమేష్ అనే ఫిజిక్స్ అతిథి అధ్యాపకుడు రంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు కూతుర్లు, మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో హార్ట్ ఎటాక్ తో మరణించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.జీతాలు రాకపోవడంతో ,ఆర్థిక ఇబ్బందుల వల్ల ,కుటుంబ పోషణ భారం ,పిల్ల చదువులకు ఫీజులు చెల్లించడం కష్టంగా మారడంతో మానసిక క్షోభకు గురి కావడంతో హార్ట్ ఎటాక్ కు గురైనట్లు పలువురు అతిథి అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగికి ఒక్క రెండు రోజు...









