Warangalvoice

Bhupalapally

అసాంఘీక శక్తులకు దూరంగా ఉండాలి
Bhupalapally, Crime, District News

అసాంఘీక శక్తులకు దూరంగా ఉండాలి

గొత్తికోయ గూడేన్ని సందర్శించిన డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి వరంగల్‌ వాయిస్, మహాముత్తారం : సమాజ శ్రేయస్సుకు హాని కలిగించే చట్ట వ్యతిరేక శక్తులకు దూరంగా ఉండాలని కాటారం డీఎస్పీ గడ్డం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని మద్దిమడుగు గొత్తికోయ గూడేన్ని కాటారం సీఐ రంజిత్‌రావుతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూడేంలో ఎవరైన కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీస్‌లకు సమాచారం అందించాలన్నారు. చట్టవ్యతిరేక సిద్ధాంతాలతో అడవుల్లో ఉండే మావోయిస్టులకు సహకరించొద్దని సూచించారు. గూడెంలోని పిల్లలను తప్పకుండా బడికి పంపించి విద్యానందించాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా పోలీసుల తమ దృష్టికి తీసుకురావాలని, చట్టపరిధిలో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గూడెం వాసుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం ఎస్సై సుధాకర్, సివిల్, సీఆర్‌పీఎఫ్‌ ...
కన్నుల పండువగా
Bhupalapally, District News

కన్నుల పండువగా

కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం వరంగల్ వాయిస్, రేగొండ: ప్రతి ఏటా శ్రావణ మాసంలో కొడవటంచ ఆలయంలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీ నరసింహస్వామి జన్మదిన స్వాతి నక్షత్రమైన శుక్రవారం కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్, ఆలయ చైర్మన్ మాదాడి అనిత కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం 11.00 నుంచి సామూహిక వరలక్ష్మి వ్రతాలలో 20 జంటలు, సామూహిక కుంకుమార్చనలలో 45 జంటలు పాల్గొనడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు గుర్రాల శ్రీనివాస్ రెడ్డి దంపతులు, శెట్టి విజయ, ఆలయ డైరెక్టర్ పోగు సుమన్, గండి తిరుపతి గౌడ్, స్థానిక సర్పంచ్ పబ్బ శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ పున్నం లక్ష్మి-రవి దంపతులు, ఆలయ సిబ్బంది కొమ్మురాజు రవి, గోరంట్ల శ్రావణ్,సుధాకర్, రవి , గ్రామ పెద్దలు పాల్గొన్నారు....
లీడర్‌ బన్‌ గయా ఆటోవాలా..
Bhupalapally, District News, Hanamkonda, Mahabubabad, Top Stories, Warangal

లీడర్‌ బన్‌ గయా ఆటోవాలా..

ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. నేతలు, లీడర్లు అంతా ఆటో కార్మికులను కలిసి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, వరంగల్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న, బీజేపీ నేత రాకేష్‌ రెడ్డి తదితరులు ఆటో నడిపి ఆటో కార్మికులను ఉత్సాహపరిచారు. -వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి Gandra Venkataraman Reddy...
గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి
Bhupalapally, District News

గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి

వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్వరంగల్ వాయిస్, భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత బాలికల హాస్టల్, జిల్లా ఎస్ఎంహెచ్ హాస్టల్లో ఉన్న సమస్యల పై గురువారం హాస్టల్ ను వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ సందర్శించారు. అనంతరం హాస్టల్లోని విద్యార్థులు అక్కడ జరుగుతున్న ఇబ్బందులను ఆయనకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన పూర్తి స్థాయి మెనూ విధానాన్ని అమలు చేయడం లేదని, నాసిరకంగా బియ్యం, పప్పులు, నూనె, కూరగాయలు ఉన్నాయని, భోజనంలో పురుగులు వస్తున్నాయని, భోజనం నాణ్యత ఉండట్లేదని, పర్మినెంట్ మహిళ వార్డులను, టీచర్లని నియమించాలని విద్యార్థులు చెప్పారు. నిన్న కొంతమంది హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు కిషన్ ను కలిసి హాస్టల్ సమస్యలు తెలియజేశారని, విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ సిబ్బందితో మాట్లాడితే సిబ్బంది అమర్యాదగా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్న...
ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం
Bhupalapally, District News

ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

వరంగల్ వాయిస్, చిట్యాల : మండలంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జుకల్ గ్రామంలో అధికారులతో కలిసి జడ్పీటీసీ గొర్రె సాగర్, మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ ఎస్ఆర్ఎస్పీ కాలువ ఇరుపక్కలా మొక్కలు నాటారు. అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమంలో కొత్తగా నిర్మింస్తున్న భవనాలను పరిశీలించారు. వారి వెంట పంచాయతీరాజ్ ఏఈ రవికుమార్, గ్రామ సర్పంచ్ పుట్టపాక మహేందర్, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, జగదీష్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి, టి.అపర్ణ, చిరంజీవి, గ్రామ సీనియర్ నాయకులు ఎండీ కాజా, గొడుగు రమేశ్, వర్క్ ఇన్ స్పెక్టర్ అంజి, గ్రామ యూత్ అధ్యక్షుడు సవోడ కిషన్, అవెంచ రమేష్, తదితరుల పాల్గొన్నారు...
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ
Bhupalapally, District News, Warangal

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ

వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో ఇటీవల మరణించిన పలు బాధిత కుటుంబాలను గురువారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. ప్రకాశరెడ్డిపేటలో గాదె పాపిరెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పోస్టల్ కాలనీలో సూరవు దయాకర్ రావు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిరికొండ మధుసూదనాచారి వెంట 50వ డివిజన్ కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్, కార్యకర్తలు ఉన్నారు....
నిత్యావసర సరుకుల పంపిణీ
Bhupalapally, District News, Telangana

నిత్యావసర సరుకుల పంపిణీ

వరంగల్ వాయిస్, వెంకటాపురం నూగూరు : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని టేకుల బోరు అనే ఆదివాసి గ్రామాల్లో గత వారం రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదల వల్ల ఊరు మొత్తం మునిగిపోయింది. తదనంతరం అక్కడ ఆదివాసి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని శుక్రవారం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పీర్ల కృష్ణబాబు ఆధ్వర్యంలో గ్రామంలో 55 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ నూనె, కేజీ ఉల్లిగడ్డ, కేజీ ఆలుగడ్డ, కేజీ పప్పు తదితర నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్బంగా కృష్ణబాబు మాట్లాడుతూ వరదల వల్ల సర్వం కోల్పొయిన వీరికి స్వచ్ఛందంగా కొంతమంది మానవతవాదులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇల్లు పోయినవారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, తక్షణ సాయం కింద కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు త్వరగా అందించాలని కోరారు. ఈ కార్యక్...