డిల్లెం బల్లెం.. బీరన్నకు బోనం
తొలి ఏకాదశి వేళ అంగరంగ వైభవంగా ఉత్సవంపల్లె, పట్టణాల్లో కురుమల సందడిఅన్ని ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తికరీమాబాద్ బీరన్న బోనాలుప్రత్యేక ఆకర్షణ
‘‘డిల్లెం బల్లెం.. అంటూ డప్పుచప్పుళ్ల మోతలు.. బీరన్న బీరన్న.. అంటూ కురుమ కులస్థుల ఆనందోత్సాహాలు.. నేత్రపర్వంగా వందలాదిగా బయలుదేరే బోనాలు..’’ తొలి ఏకాదశి రోజు కురుమలు సంప్రదాయంగా బీరన్న బోనాల పండుగను వైభవంగా జరపుకుంటారు. వారికే ప్రత్యేకమైన ఈ పండుగను పల్లె, పట్టణాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. బోనాల పండుగ సందర్భంగా ప్రతీ కురుమ ఇల్లు చిన్నాపెద్దా, పిల్లలు, బంధువులతో కళకళలాడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుమ వాడల్లో జరిగే ఈ బోనాల యాత్రల్లో వరంగల్ నగరంలోని కరీమాబాద్, రంగశాయిపేట, కాశిబుగ్గ, ఉర్సు ప్రాంతాల్లో జరిగే వేడుకలు ప్రత్యేకమైనవి. వీటిని చూడడానికి వందలాదిగా తరలివస్తారు. రేపు(ఆదివారం) జరుగబోయే బీరన్న బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్...