Warangalvoice

Today_banner

నేనే సుప్రీమ్
District News, Today_banner, Top Stories

నేనే సుప్రీమ్

బ‌ల్దియాలో నేను చెప్పిందే వేదం ఇత‌రులెవ‌రూ ఎద‌గ‌కుండా ప‌క్కా ప్లాన్‌ డిప్యూటీ మేయ‌ర్‌పై చిన్న‌చూపు సంవ‌త్స‌రం దాటినా కారు, క్యాంపు క్ల‌ర్కే లేరు నేటికీ స్టాండింగ్ క‌మిటీ ఊసే లేదు ఫ్లోర్ లీడ‌ర్లు లేరు.. ఆయా పార్టీల‌కు గ‌దుల కేటాయింపూ లేదు.. రాజకీయాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాల‌ని ప్ర‌తి ఒక్కరూ కోరుకుంటారు. కార్పొరేట‌ర్‌గా గెలిచిన త‌ర్వాత సీనియ‌ర్లు ఎవ‌రైనా ఉంటే మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్‌ కావాల‌నుకోవ‌డం కామ‌న్‌. కానీ, అందరికీ ఆ చాన్స్ రాదు. మరీ ఈ రెండు కుదరకపోతే ఉన్న నెక్ట్స్‌ ఆప్షనే స్టాండింగ్ కమిటీ మెంబర్. మిగిలిన కార్పొరేటర్ల తాపత్రయం అంతా దానిపైనే ఉంటుంది. కాని వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలో ఆ అవ‌కాశ‌మే లేకుండా చేస్తున్నారు. పాల‌క వ‌ర్గం ఏర్ప‌డి సంవ‌త్స‌రంన్నర గ‌డిచినా నేటికీ స్టాండింగ్ క‌మిటీ ఏర్పాటుపై ఊసే లేదు. బ‌ల్దియాలో నేనే సుప్రీమ్‌..నేను చెప్పిందే వే...
నిరంతర సాధనే – విజయమార్గం
Telangana, Today_banner, Top Stories

నిరంతర సాధనే – విజయమార్గం

ప్రణాళికతో చదివి విజేతగా నిలువండిపట్టుదలతో ఇష్టపడి చదవాలిచదువుతోనే ఉజ్వల భవిష్యత్తురాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథికామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు ‘‘సిలబస్ పై పట్టు.. ప్రామాణిక పుస్తకాల అధ్యయనం.. నిరంతర సాధన..’’ ఇవే పోటీపరీక్షల్లో విజేతగా నిలువడానికి విజయ సూత్రాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఉద్బోధించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీపరీక్షలపై ఉద్యోగార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మార్గనిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికతో చదవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. ప్రతీ నిమిషం కీలకమేనని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే విజయానికి దగ్గరవుతారని సూచించారు. అంకిత భావంతో చదివి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అభ్యర్థులను ఉత్సాహపరిచారు. వ...
పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్
Crime, District News, Today_banner, Warangal

పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్

ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారిపై సీరియ‌స్‌ఆరుగురు య‌జ‌మానుల‌పై కేసులుచేయి చేసుకోవ‌డంతో ముదిరిన వివాదంఒక రోజు బంద్ పాటించి నిర‌స‌న‌ ‘‘ప్రభుత్వానికి క్రమం తప్పకుండా లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నాం.. అలాగే అధికారులకు, పోలీసుల‌కు నెలవారి మామూళ్లు అందిస్తున్నాం.. అడిగినప్పుడల్లా లిక్క ర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నాం.. ’’ ఇన్నీ చేస్తున్నా ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కారంటూ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డంపై బార్ అండ్‌ రెస్టారెంట్ య‌జ‌మానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటిస్తే బార్లు న‌ష్టాల్లో కూరుకుపోయి మూసుకోవాల్సిన‌ ప‌రిస్థితి వ‌స్తుంద‌ని య‌జ‌మానులు అంటుండగా ఎవ‌రైనా ఎక్సైజ్‌ నిబంధ‌న‌లు పాటించాల్సిందే నంటూ పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇరువురి మ‌ధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మార‌డంతో బార్ య‌జ‌మానులు మంగ‌ళ‌వారం ఒక్క రోజు బంద్ కూడా పాటించారు. పోలీసులు మ...
పాద‌యాత్ర‌ల జోరు
Political, Today_banner, Top Stories

పాద‌యాత్ర‌ల జోరు

సెంటిమెంటుగా భావిస్తున్న నేత‌లు ఎన్టీఆర్‌తో శ్రీ‌కారం.. వైఎస్ తో వైభవం రాష్ట్రంలో కొన‌సాగుతున్న వైఎస్ శ‌ర్మిల, ప్రవీణ్ కుమార్ పాద‌యాత్ర‌ అత్య‌ధిక రోజులు పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌ నేడు యాదాద్రిలో మూడో విడ‌త ప్రారంభించిన బండి సంజ‌య్‌ రాష్ట్రంలో పాద‌యాత్ర‌ల జోరు కొన‌సాగుతోంది. అధికార‌మే ల‌క్ష్యంగా పాద‌యాత్ర‌ల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. పాద‌యాత్ర‌లు చేయ‌డం ద్వారా ప‌వ‌ర్‌లోకి రావ‌చ్చ‌ని భావిస్తున్నారు. గ‌తంలో ఇది వ‌ర్క‌వుట్ కావ‌డంతో నేటి నేత‌లు సెంటిమెంటుగా భావిస్తున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి సారిగా ఎన్టీరామారావు పాద‌యాత్ర చేప‌ట్ట‌డంద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువై అధికారంలోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా రాష్ట్రమంతా పాద‌యాత్ర చేసి అధికారాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఇదే ఒర‌వ‌డిని వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా కొన‌సాగించి ముఖ్య‌మంత్రి అయ్యా...
కోనారెడ్డి.. వెలవెల
District News, Today_banner

కోనారెడ్డి.. వెలవెల

చెరువు కట్ట తెగి మూడేళ్లు..ఇప్పటికీ పూర్తికాని మరమ్మతు పనులు2వేల ఎకరాల ఆయకట్టుకు నీరందని దుస్థితినాసిరకంగా పనులు.. పట్టించుకోని అధికారులు వరంగల్ వాయిస్, వర్ధన్నపేట: మండలం కేంద్రంలో రైతులకు పెద్దదిక్కు అయినా కోనారెడ్డి చెరువు కట్ట తెగిపోయి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కింద ఆయకట్టు 2000 ఎకరాలు ఇప్పుడు పంట పండించలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వం కోనారెడ్డి చెరువు పనులను చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు.తూతూ మంత్రంగా పనులుకోనారెడ్డి చెరువు కట్ట కాంట్రాక్టు పనులు చేస్తున్న సంస్థలు పనులను చేపట్టి చేతులు దులుపుకొని పోతున్నాయి తప్ప రైతులకు మేలు చేకూర్చే విధంగా పనులను ముందుకు తీసుకెళ్లడంలో కాంట్రాక్టర్లు విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం చెరువు కట్ట రిపేరు కోసం దాదాపు రూ.40 లక్షల కాంట్రాక్టులను దక్...
సిన్సియారిటీ కేరాఫ్ సుందర్ రాజ్
District News, Legend, Today_banner, Top Stories

సిన్సియారిటీ కేరాఫ్ సుందర్ రాజ్

విద్యావేత్త నుంచి కుడా చైర్మన్‌ దాక సుందర్‌ రాజ్‌ యాదవ్‌ విజయ ప్రస్థానంఉద్యమకారుడిగా, టీఆర్‌ఎస్‌ అధిష్ఠాన విధేయుడిగా పేరుఅందరితో కలివిడిగా.. పార్టీకి ట్రబుల్‌ షూటర్‌గా..చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ కు కుడిభుజంగా ప్రసిద్ధిఅఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఘన సన్మానం తెలంగాణ ఉద్యమ కారుడు.. విద్యా సంస్థల అధిపతి.. టీఆర్ఎస్ క్రియాశీల నాయకుడు.. ఈ మూడు విభిన్న రంగాలకు వంద శాతం న్యాయం చేసిన సమర్థత సుందర్ రాజ్ యాదవ్ సొంతం. ఓపిక, సహనం ఆభరణాలుగా, నిబద్ధత, నిజాయితీ పెట్టుబడిగా ఎదిగిన వినయశీలి. దశాబ్దకాలం ఎదురుచూపులకు కుడా చైర్మన్ పదవి రావడం.. ఉద్యమకారుడికి లభించిన సముచిత గౌరవం. ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద కమ్యూనిటీల్లో ఒకటైన యాదవ కులానికి దక్కిన గుర్తింపు.. ఏప్రిల్ 7న బాధ్యతలు స్వీకరించిన సుందర్ రాజ్ యాదవ్ ను అఖిల భారత యాదవ మహాసభ ఘనంగా సన్మానించనుంది. 31న (రేపు) హనుమకొండ చింతగట్టు కేఎల్ఎన్ ఫంక్షన్ ...
ప్రతిభావంతులకు అండ.. ‘చిట్ల’ మోరియల్ ట్రస్ట్
District News, Today_banner, Top Stories

ప్రతిభావంతులకు అండ.. ‘చిట్ల’ మోరియల్ ట్రస్ట్

సామాజిక సేవే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథిఅమ్మనాన్నల స్ఫూర్తితో పుట్టిన ఆలోచన..పుట్టిన ఊరికి ఏదైనా చేయాలన్న తపనపేద విద్యార్థులకు భరోసాగా ట్రస్ట్ ఏర్పాటువిద్యా స్ఫూర్తిగా సాగుతున్న బృహత్తర కార్యక్రమం ‘‘పేదరికం ఎంతో కఠినమైనదో తెలుసు.. దాని ఫలితాలు మనిషి జీవితంపై ఎంత ప్రభావం చూపుతాయో తెలుసు.. పేదరికంపై విజయం సాధించాలంటే సగటు జీవికి చదువు ఒక్కటే ఏకైక ఆయుధం.. చిన్నతనంలో అమ్మనాన్న పడిన కష్టమే తనను ఉన్నత శిఖరాలు అధిరోహింపజేసేలా చేసింది..’’ ఈ మాటలు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చిట్ల పార్థసారథి హృదయాంతరాల్లోనుంచి వచ్చినవి. అమ్మనాన్నల స్ఫూర్తితో పుట్టిన ఊరి రుణం తీర్చుకోవడానికి చిట్ల ప్రమీల - జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ను ఆయన 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ యేడాది పేద ప్రతిభావంతులకు ప్రోత్సాహంగా నగదు పురస్కా...
తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు
Telangana, Today_banner, Top Stories

తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథిఎస్సెస్సీ టాపర్లకు అవార్డుల ప్రదానం వరంగల్ వాయిస్, నిజామాబాద్ : తెలివితేటలు ఏ ఒక్కరికే సొంతం కాదని, ప్రతిభావంతులుగా మారేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరికి అర్హత, అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి పేర్కొన్నారు. తెలివితేటలకు కుల, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం చిట్ల ప్రమీల, జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి యేటా నిర్వహిస్తున్న ఆనవాయితీని పాటిస్తూ ‘ విద్యా స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ పట్టణంలోకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి,...
కాలంతో పోటీపడు.. కొలువుతో నిలబడు
Telangana, Today_banner

కాలంతో పోటీపడు.. కొలువుతో నిలబడు

కష్టంతో కాదు.. ఇష్టపడి చదవాలిసమయ పాలన, పక్కా ప్రణాళిక అవసరంఅలుపెరుగని శ్రమతో విజయం సాధ్యంగ్రూప్‌ -1 సాధిస్తే జీవితమే మారిపోతుందిరాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథిఖమ్మంలో ఉద్యోగార్థులకు ప్రేరణ తరగతులు ‘‘ప్రతీ ఒక్కరిలో తనకు తెలియని శక్తి సామర్థ్యాలు ఎన్నో ఉంటాయి.. వాటిని బయటకు తీసి సరైన సమయంలో వినియోగించుకున్నప్పుడే మనిషి జీవితానికి సార్థకత.. నిరాశ, నిస్పృహలు వద్దు.. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టం కాదు..’’ అని ఉద్యోగార్థులకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి సూచించారు. మంగళవారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్‌ పోటీపరీక్షలకు ప్రభుత్వ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆయన సూచనలు, సలహాలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా వారిలో ప్రేరణ కలిగించారు. కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలని.. కొలువు సాధించేదాక విశ్రమించొద్దని పిల...
‘చేనేత’లో ఇంటిదొంగలు
Today_banner, Top Stories

‘చేనేత’లో ఇంటిదొంగలు

వ‌డ్డీతోస‌హా గ్రాంట్‌ను మింగిన ఘ‌నులురూ.3 కోట్లు స్వాహా..అవినీతికి పాల్పడిన చేనేత సహకార సంఘం అధ్య‌క్షులుత్రిపుల్ ఆర్ స్కీం ద్వారా డ‌బ్బులు మంజూరుప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ఆడిట్ అధికారులుచ‌క్రం తిప్పిన వరంగల్ జిల్లా సహ‌కార కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ చేనేత కార్మికుల సంక్షేమాన్ని అటకెక్కించారు.. వారికి చేతినిండా ప‌ని క‌ల్పించాల‌న్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ల‌క్ష్యాల‌ను నీరుగార్చారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని 15 చేనేత స‌హ‌కార సంఘాలకు గ్రాంటు రూపేణా అంద‌జేసిన డ‌బ్బుల‌తోపాటు దానిపై వ‌చ్చిన వ‌డ్డీని సైతం దిగ‌మింగారు. అందుకు వ‌రంగ‌ల్ జిల్లా చేనేత స‌హ‌కార కార్యాల‌య అధికారుల‌ను పావులుగా వాడుకున్నారు. వారికి అంతో ఇంతో ముట్ట‌జెప్పి పైసా ఖ‌ర్చు చేయ‌కుండా, క‌నీసం బిల్లులు కూడా లేకుండానే ఆడిట్ చేయించుకున్నారు. చేసేదే మ‌నం.. మ‌న‌ల్ని ఎవ‌రు ప్ర‌శ్నిస్తారు అనుకున్న అధికారులు సైతం చేనేత స‌...