Warangalvoice

Today_banner

లక్షద్వీప్‌ ఎంపి సభ్యత్వం పునరుద్దరణ
Political, Today_banner

లక్షద్వీప్‌ ఎంపి సభ్యత్వం పునరుద్దరణ

సుప్రీం కేసు నేపథ్యంలో లోక్‌సభ దిద్దుబాటు చర్య వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: లక్షద్వీప్‌ ఎంపీ, ఎన్‌సీపీ సీనియర్‌ నేత మహ్మద్‌ ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వం విషయంలో.. లోక్‌సభ సెక్రటేరియెట్‌ వెనక్కి తగ్గింది. వెంటనే అతని ఓలక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. సుప్రీం కోర్టులో బుధవారం వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఫైజపై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు, లక్షద్వీప్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ ప్రకటించింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియెట్‌ జనరల్‌ పేరిట ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. దీంతో జనవరి 13వ...
కన్నడనాట బిజెపి ఎదురీత
Political, Today_banner

కన్నడనాట బిజెపి ఎదురీత

అధికార పార్టీలో లంచావతారాల తంటా మరోమారు అధికారం కోసం జెడిఎస్‌ యత్నాలు వరంగల్ వాయిస్,బెంగళూరు: కర్ణాటకలో మరో నెలన్నరలోగా ఎన్నికలు జరగనుండడంతో.. రాజకీయ సవిూకరణలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీఇప్పటికే 224 స్థానాలకు గాను.. 124 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ.. ఆచితూచి అడుగులు వేస్తోంది. కన్నడనాట బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్‌ బలమైన మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ కలవకుండా బిజెపి లోపాయకారి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు మాజీమంత్రి, మాజీ బిజెపి నేత గాలి జనార్ధన్‌ రెడ్డి కూడా ప్రాంతీయ పార్టీ పెట్టి రంగంలోకి దిగారు. తమ గుర్తును ఆయన ఫుట్‌బాల్‌గా ఎంచుకున్నారు. నిజానికి కర్నాటకలో బిజెపి నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఏర్పడ్డా..అధికారం దక్కలేదు. కుమారస్వామి ...
వారసత్వం మా బలం
Today_banner

వారసత్వం మా బలం

ఇన్‌స్టాలో రాహుల్‌ పోస్ట్‌ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తన ట్విట్టర్‌ బయోని ’డిస్‌ క్వాల్గిªడ్‌ ఎంపీ’గా మార్చుకున్నారు. తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్‌ చేస్తూ రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. తన సోదరి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరిస్తూ చేసిన ఆవేశభరిత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్‌ గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్‌ ఎంపీగా అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ (అనీనిణస।బబ) పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ’సంకల్ప్‌ సత్యాగ్రహ’ దీక్షలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద చేపట్టిన దీక్షలో ప్రియాంక గాంధీ పాల్గొని మాట్లాడారు. తన తండ్రి, మాజీ ప్...
కెటిఆర్‌ రాజీనామా చేయాలి..
Political, Telangana, Today_banner, Top Stories

కెటిఆర్‌ రాజీనామా చేయాలి..

లేదంటే బర్తరఫ్‌ చేయాలి నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలి మహాధర్నాలో బండి సంజయ్‌ డిమాండ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఎస్‌ పీఎస్‌ సీ పేపర్‌ లీకేజీ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. దోషలును తేల్చడంతో పాటు, కెటిఆర్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను మరోమారు తెరవిూదకు తెచ్చారు. అదే సందర్భంలో నిరుద్యోగులకు కనీసం లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌ చేస్తున్నారు. ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న బండి సంజయ్‌.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పేపర్‌ లీక్‌ కేసులో విచారణ జాప్యం చేస్తూ నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని .. లేకపోతే భర్తరఫ్‌ చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు.పేపర్‌ లీక్‌ కేసులో ఇద్దరే నిందితులన్న కే...
ఇందిర అడుగజాడల్లో రాహుల్‌
Political, Today_banner, Top Stories

ఇందిర అడుగజాడల్లో రాహుల్‌

జైలుకు వెళ్లడం ద్వారా సానుభూతికి యత్నం రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ఎంపిల రాజీనామా యోచన? రాజకీయ ప్రత్యామ్నాయాలపై చర్చిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఇందిర అడుగజాడల్లో రాహుల్‌ రాజకీయ సోపానం నిర్మించుకోవాలని చూస్తున్నారు. జైలుకు వెళ్లడం ద్వారా సానుభూతికి యత్నం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ఎంపిల రాజీనామా యోచనలో కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఏది చేస్తే లాభమో అన్న తీరులో రాజకీయ ప్రత్యామ్నాయాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇందిరాగాంధీ ఆదర్శంగా రాహుల్‌ గాంధీ అడుగులు వేస్తున్నారు. 1977 లో అనర్హత వేటు పడినప్పుడు కొద్ది రోజులపాటు ఇందిరమ్మ జైల్లో ఉన్నారు. దీంతో ఆమెకు ప్రజల్లో భారీగా ఇమేజ్‌ పెరిగింది. ఇదే తరహాలో ఇప్పుడు తన రాజకీయ జీవితాన్ని మలచుకోవాలని యోచిస్తున్నారు. అలాగే వయనాడ్‌కు ఉప ఎన్నిక వస్తే తన స్థా...
పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొన్న రాహుల్‌
Political, Today_banner

పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొన్న రాహుల్‌

సూరత్‌ కోర్టు తీర్పు తరవాత పార్లమెంట్‌కు హాజరు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: సూరత్‌ కోర్టు తీర్పు అనంతరం రాహుల్‌ శుక్రవారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఉదయం పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్‌ హాజరయ్యారు. అనంతరం లోక్‌సభ ప్రారంభం కాగానే ఆ సమావేశం లోనూ పాల్గొన్నారు. కోర్టు తీర్పుతో రాహుల్‌పై అనర్హత వేటు పడే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత , ఎంపీ రాహుల్‌ గాంధీ కి గుజరాత్‌ లోని సూరత్‌ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ’దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..?’ ఆయన ప్ర...
భారత రాజకీయాల్లో అనూహ్య పరిణామం
Political, Today_banner

భారత రాజకీయాల్లో అనూహ్య పరిణామం

కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌పై అనర్హత వేటు లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తక్షణమే లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్‌ వయొనాడ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ నేత వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: భారతీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే భారత్‌ జోడోయాత్రతో ప్రజల ముందుకు వచ్చిన రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిరది. ఎంపీగా రాహుల్‌ గాంధీ చెల్లుబాటు కారని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు. రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యుడిగా అనర్హత పొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై.. లోక్‌సభ సెక్రటేరియేట్‌ అనర్హత వేటు విధించింది. లోక్‌సభ నుంచి ఆయన్ను డి...
ఉత్సాహంగా శోభకృత్‌ ఉగాది ఉత్సవాలు
Today_banner

ఉత్సాహంగా శోభకృత్‌ ఉగాది ఉత్సవాలు

సంప్రదాయ పంచెకట్టులో హాజరైన జగన్‌ వరంగల్ వాయిస్,అమరావతి: శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్టాల్ల్రో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉగాది పచ్చడి సేవించి తెలుగు వారి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణాలు వినిపించారు.రాష్ట్రవ్యాప్తంగా నేతలు ప్రజలు ఈ పండుగను వైభవంగా నిర్వహించారు. ఏపీ సీఎం జగన్‌ ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా తెలుగు సంప్రదాయాలు సంస్కృతి ఉట్టిపడేలా సాగాయి. తాడేపల్లి లోని ఏపీ సీఎం జగన్‌ నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆయన సతీమణి భారతిలు సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలకు ముందు శ్రీ వేంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్‌ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. సంప్రదాయ దుస్తుల్లో జగన్‌ భారతి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్ర...
పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
Political, Telangana, Today_banner

పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వ్యవస్థ పటిష్టంగానే ఉంది అపోహలు సృష్టించేవారిని యువత నమ్మొద్దు త్వరలోనే మళ్లీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అసవరం లేదు తప్పు చేసిన ఇద్దరి వెనక ఎవరున్నా వదలిపెట్టం విూడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌ స్పష్టీకరణ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పటిష్టంగా ఉందని...పేపర్‌ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు చేసిన తప్పు అని.. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని మంత్రి కేటీఆర్‌ వివరించారు. భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లలో ఒకటిగా గుర్తింపు టీఎస్‌ పీఎస్సీ గుర్తింపు పొందిందని.. కాలాగుణంగా సాంకేతికంగా ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగానే ఓటీఆర్‌.. వన్‌ టైం రిజిస్టేష్రన్‌ తీసుకు రావటం జరిగిందన్నారు. ప్రభుత్వ...
హస్తిన వేదికగా లేచింది మహిళా లోకం
Political, Today_banner

హస్తిన వేదికగా లేచింది మహిళా లోకం

మహిళా రిజర్వేషన్లపై పిడికిలి బిగింపు జంతర్‌మంతర్‌ వద్ద దీక్షను ప్రారంభించిన ఏచూరి మహిళాబిల్లు చారిత్రక అవసరమన్న కవిత వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్‌ సాధించే వరకూ విశ్రమించేది లేదని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వెళ్లడిరచారు. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని కవిత అన్నారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత ఢల్లీిలోని జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేపట్టారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఫీుభావం ప్రకటించారు. అంతకుముందు వేదిక వద్దకు చేరిన ఎమ్మెల్సీ కవ...