Warangalvoice

Today_banner

Ministry Expand | నిరాశలో.. ఆశావహులు
Today_banner

Ministry Expand | నిరాశలో.. ఆశావహులు

ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉలుకూ..పలుకూ లేని ప్రభుత్వం ఏడాదైనా కనికరించని కాంగ్రెస్‌ అధిష్ఠానం కొత్త ఏడాదిలోనూ తప్పని ఎదురు చూపులు రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ మూడు అడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రజా పాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ సంవత్సరం పూర్తయినా మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంటోంది. కీలకమైన శాఖలన్నీ సీఎం రేవంత్‌ రెడ్డి వద్దే ఉండటంతో పాలన పడకేసింది. గత కొన్ని నెలలుగా విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. డిసెంబర్ చివరిలోగా విస్తరణ జరుగుతుందంటూ మంత్రులు సైతం ప్రకటనలు చేసినా కార్యరూపం దాల్చలేదు. అయితే విస్తరణకు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండటం, ఈ నెల మూడో వారంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సైతం విదేశీ ...
Anand Mahindra: ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
Today_banner

Anand Mahindra: ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

Anand Mahindra: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ చిత్రాన్ని పంచుకున్నారు. ఇంతకీ ఏంటా ఫొటో? ఎందుకంత స్పెషల్? ఇంటర్నెట్ డెస్క్: స్ఫూర్తిమంతమైన కథనాలను పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన ఎక్స్ ఖాతాలో ఓ ఫొటో షేర్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో (Lok sabha elections 2024) ఓటేసి ఒక చేతిలో ఓటరు కార్డు, వేలికి సిరా గుర్తు చూపిస్తున్న ఓ వ్యక్తి ఫొటో అది. అందులో ప్రత్యేకత ఏముంది? అనుకుంటున్నారా..! ఆయన దేశంలో అంతరించిపోతున్న అరుదైన తెగకు చెందిన వ్యక్తి మరి. తన జీవితంలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఫొటోను మహీంద్రా షేర్ చేస్తూ.. "నా వరకు 2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్ ఫొటో..! గ్రేట్ నికోబార్ (Great Nicobar Islands) దీవుల్లోని షోంపెన్ తెగ (Shompen tribe)లో ఉన్న మొత్తం ఏడుగ...
నిజాంను నిగ్గదీసిన కవి దాశరథి
Cultural, Telangana, Today_banner

నిజాంను నిగ్గదీసిన కవి దాశరథి

‘ఓ నిజాము పిశాచమా! కానరాడు..నిన్ను బోలిన రాజు మాకెన్నడేని..తీగలను తెంపి అగ్నిలోకి దింపినావు.. నా తెలంగాణ కోటి రత్నాల వీణ.. ఈ పద్యం వినని, తెలియని తెలంగాణావారుండరు. ఒక్కోసారి అన్పిస్తుంది ఇలాంటి పద్యాలే కవులు రాయకపోతే తెలంగాణ ప్రాంతీయ స్పృహ అందరిలో పుట్టేదా? అని. అటువంటి పద్యాలు, వచనాలు ఎన్నో ఈనేలన పురుడు పోసుకున్నాయి. మానులై ఎన్నో విజయాలూ అందించుటలో సహకరించాయి. అలాంటి ఉద్యమ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యంలో తెలంగాణా అనగానే సాధారణంగా గుర్తొచ్చే కవి దాశరథి కృష్ణమాచార్యులు.నిజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారి వ్యవస్థను, అన్యాయం, అధర్మం ఉన్న ప్రతి చోటా కవితాశక్తి ధిరోదాత్తుడై కనిపించినవాడు దాశరథి. ఆయనలోని కవితాధార ఎందరో పీడిరచేవారిని గజగజ వణికించింది. అది అగ్నిధారై ప్రవహించింది. రుద్రవీణై వినిపించింది. అమృతాభిషేకం కురిపించి కవితా పుష్పకంలో వికసించింది. అట్లాంటి తెలంగాణా ...
ఆ ఒక్క టిక్కు పెట్టి ఉంటే..
District News, Telangana, Today_banner

ఆ ఒక్క టిక్కు పెట్టి ఉంటే..

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతుల్లో తెలుగువాళ్లే దాదాపు 120 మంది ఉన్నారని తెలుస్తోంది. చనిపోయినవారిలో, కుటుంబం మొత్తానికి జీవనాధరమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు. వాళ్ల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక-సామాజిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. ఈ పరిస్థితుల్లో, ట్రైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా ఆదుకుంటుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా నామమాత్రం. కేవలం 45 పైసల ఖర్చుకే ₹10 లక్షల బీమా అందుతుంది. 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా మీరు కూడా తరచుగా/అరుదుగా రైలు ప్రయాణం చేస్తుంటే, ఇప్పుడు చెప్పబోయే అతి ముఖ్యమైన విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పటివరకు చాలాసార్లు రైలు ప్రయాణం చేసినా, ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుని ఉండరు. రైలు ప్రయాణం కోసం ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసే సమయంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీనిని టిక్ చేయండి. దీనివల...
విప్లవ యోధుడు వీర సావర్కర్
Cultural, Today_banner

విప్లవ యోధుడు వీర సావర్కర్

భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన దేశభక్తుడు , విప్లవ యోధుడు వీర సావర్కర్ జయంతి మే 28న స్వాతంత్ర సమరసినాని సావర్కర్ భారత స్వాతంత్ర్య సమరంలో ఒక ప్రభంజనం. సావర్కర్ విద్యార్థి దశ నుండి అర్థవంతమైన జీవితాన్ని ఆరంభించారు. విప్లవకారులు శాపేకర్ సోదరుల్ని బ్రిటిష్ వారు ఉరి తీశారన్న వార్త విన్న చిరుప్రాయంలోని సావర్కర్ చలించిపోయారు. వినాయక్ దామోదర్ సావర్కర్ కు స్వాతంత్ర సంగ్రామంలో 50 సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. అండమాన్ దీవుల్లో ని కారాగారంలో ఆయన దుర్భర జీవితం గడుపుతున్నప్పటికీ తోటి ఖైదీలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రతిఘటించటానికి వారిని సంఘటిత పరిచి సమ్మెలు నిర్వహింప చేశారు. జైల్లో ఆయన అనారోగ్యంగా ఉన్నా అధికారులు చిత్రహింసలు పెట్టడం మానలేదు. రాసుకోవడానికి కాగితాలు ఇవ్వకపోయినా సావర్కర్ తనకు దొరికిన కాలి బూటు మేకులతో గోడలపై కవిత్వాలు రాశారు. ఆ రచనలో ఆయన రాబోయే దేశ పరిణామాల మీద స్ప...
రిపోర్టర్ నారద – లోకకళ్యాణార్ధం
Cultural, Today_banner

రిపోర్టర్ నారద – లోకకళ్యాణార్ధం

దేవర్షి నారద జయంతి  పాత్రికేయులకు ఆది పురుషుడు నారద మహాముని  ‘వార్తయందు జగము వర్ధిలులచున్నది యదియు లేని నాడ యఖిలజనులు సంధకార మగ్నులగుదురు గాన వార్త నిర్వహింపవలయుజతికి’ అంటాడు నారదుడు. వార్త అంటే సమాచారమనీ నాటి అభిప్రాయం. వార్త అంటే సమాచారం, సమాచరమే విజ్ఞానం. సమాచరమే అధికారం. సమాచారం అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇటు సమాచార రంగానికి, అటు పాత్రికేయులకు ఆది పురుషుడు నారద మహాముని ఆయన సమాచారాన్ని లోక కల్యాణానికి ఉపయోగించారు. రాజసూయానికి ముందు ధర్మరాజు వద్దకు వస్తాడు నారదుడు. ధర్మరాజు రాజనీతిని బోధిస్తూ ఒక పద్యాన్ని ఉదహరిస్తాడు. ఇది ఆంధ్ర మహాభారతం సభా పర్వంలో ఉంది. పై పద్యం ఈనాటి అభిప్రాయ వార్త నిర్వహింప వలయు జతికి అంటే ఇక్కడ అర్థం రాజుకు వార్త చేరవేయాలని. ప్రజాస్వామ్యంలో సిద్ధాంతరీత్య ‘అధిపతి’ అంటే ప్రజలు కనుక ప్రజలకు వార్త అందించాలని ఆ పద్యాన్ని ఈనాటికి అన్వయించుకోవచ్చు. మరొక వైపు ప్రజాస్...
20ఏళ్ళ వయస్సులోనే డాక్టర్ పట్టాపొందాడు
Today_banner, Top Stories

20ఏళ్ళ వయస్సులోనే డాక్టర్ పట్టాపొందాడు

ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవము ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాని 2007 ఏప్రిల్ 25న ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ దేశాన్ని కలిసి ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మలేరియా కారకాలను కనుగొన్నందుకు నోబెల్ బహుమతి పొందిన రోనాల్డ్ రాస్ తన పరిశోధనలను హైదరాబాద్ కేంద్రంగానే నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు అంతే స్థాయిలో డాక్టర్ మల్లన్న క్లోరోఫామ్ ఇచ్చే పద్ధతులపై విశేషమైన పరిశోధన చేశారు. సమాజ సేవతో పాటు హైదరాబాద్‌లో వైద్య రంగంలో తనకంటూ పేరు సంపాదించుకుని అనేక వ్యాధులకు ఖచ్చితమైన నివారణ పద్ధతులను కనుగొన్న ఆయన తెలంగాణ ప్రజలందరికి ఆదర్శమూర్తి. తన తండ్రి ఇండియన్ మిలిటరీలో పనిచేస్తున్న కాలంలో మధ్యప్రదేశ్లో 1872 అక్టోబర్ 26న మల్లన్న జన్మించారు. తండ్రి రిటైరయిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అప్పటికే మెడికల్ విద్యకు ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌లోన...
ఆందోళన కలిగించేలా దేశంలో కరోనా వ్యాప్తి
Telangana, Today_banner

ఆందోళన కలిగించేలా దేశంలో కరోనా వ్యాప్తి

నాలుగు వేలకు పైనే కొత్త కేసులు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ:దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా మూడు వేల కేసులు నమోదవ్వగా.. తాజాగా 24 గంటల వ్యవధిలో ఏకంగా నాలుగు వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,31,086 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. 4,435 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్త కేసుల్లో 46 శాతం మేర పెరుగుదల కనిపించింది.కాగా, 163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబర్‌ 25న 4,777 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో దేశంలో కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 44,733,719కి చేరింది. ప్రస్తుతం 23,091 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల వ్యవధిలో కరోన...
ఆందోళనకరంగా కరోరనా కేసులు
Today_banner, Top Stories

ఆందోళనకరంగా కరోరనా కేసులు

మాస్కులు తప్పనిసరి చేసిన తమిళనాడు వరంగల్ వాయిస్,చెన్నై: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ `19 కేసుల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం కీలక నిర్ణయం వెలువరించింది. అన్ని ఆసుపత్రుల్లోనూ ఏప్రిల్‌ 1 నుండి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులలో ఇన్‌ఫెక్షన్‌, క్రాస్‌`ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందన్న నిపుణుల హెచ్చరికతో.. అన్ని ఆసుపత్రులలోని ఇన్‌పేషెంట్‌, ఔట్‌ పేషెంట్‌ వార్డులలో వైద్యులు, మెడికోలు, ఇంటర్న్‌లు, నర్సులు, సాంకేతిక నిపుణులు, పరిపాలనా సిబ్బంది, రోగులు, అటెండర్లు అన్ని వేళలా మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోనూ మాస్కులు తప్పనిసరి ధరించేలా డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ టీఎస్‌ సెల్వ వినాయగం జిల్లా ఆరోగ్య అధికారులను ఆదేశారు. నిబంధనలు పాటించాల...
రెండో వందేభారత్‌ రాక
Today_banner, Top Stories

రెండో వందేభారత్‌ రాక

ప్రధానికి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలుగు రాష్టాల్ర మధ్యన రెండవ వందేభారత్‌ రైలు పరుగుపెట్టనుంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్‌ 8 వ తేదీన సికింద్రాబాద్‌ నుండి ఘనంగా ప్రారంభించనున్నారు. వరుసగా రెండు రైళ్లను అందించినందుకు ప్రధాని మోడీకి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్‌ ` తిరుపతి మధ్యన ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌, తిరుపతి మధ్యన ప్రయాణానికి 11 నుండి 12 గంటల సమయం పడుతుండగా, వందేభారత్‌ రైలు ద్వారా కేవలం 8 గంటల30 నిముషాల్లోనే గమ్య స్థానికి చేరుకుంటుంది. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో రైలు ఆగనుంది.సాధారణ రోజుల్లో వందే భారత్‌ ట్రైన్‌ `నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. రెండో వందే భారత్‌ రైల్‌ కేటాయించినందుకు ...