Warangalvoice

Today_banner

Katta Maisamma | ఘనంగా కట్టమైసమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.. సురంగల్‌లో శతసప్త చండీయాగం
Today_banner

Katta Maisamma | ఘనంగా కట్టమైసమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.. సురంగల్‌లో శతసప్త చండీయాగం

మొయినాబాద్‌ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్‌ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. వరంగల్ వాయిస్, మొయినాబాద్‌ : మొయినాబాద్‌ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్‌ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని పునఃప్రతిష్టాపన చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోనికి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి అర్చన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వేదపండితులతో శత సప్త చండీయాగం నిర్వహించారు. అనంతరం మహిళలతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని కన్నుల విందుగా నిర్వహించారు. వార్షికోవత్సంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం నిర్వహించారు. హోమం కార్యక్రమాన్ని ఆదాయ పన్ను శాఖ మాజీ అధికారి రాములు, కె మల్లేశ్‌ గౌడ్‌ దంపతుల చేత...
SpringSpree | వరంగల్‌ NIT లో మూడు రోజులు స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌.. పాల్గొననున్న బ్రహ్మానందం
Today_banner

SpringSpree | వరంగల్‌ NIT లో మూడు రోజులు స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌.. పాల్గొననున్న బ్రహ్మానందం

SpringSpree | వరంగల్ నిట్‌ స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరాలను వెల్లడించారు. వరంగల్ వాయిస్,  హనుమకొండ  : వరంగల్ నిట్‌ స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరాలను వెల్లడించారు. సంగీతం, నృత్యం, కళలు, వినోదం వంటి రంగాల్లో ప్రతిభను వెలికి తీయడానికి వేదికగా స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలోని ప్రముఖ కళాశాలల వార్షికోత్సవాల్లో ఒకటిగా వరంగల్‌ నిట్‌ పేరుగాంచింది. దేశవ్యాప్తంగా ఉన్న నిట్ కాలేజీల విద్యార్థులు ఈ మహోత్సవానికి హాజరవుతారని బిద్యాధర్‌ ...
KTR | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ ప్ర‌మాదం.. పూర్తి బాధ్య‌త సీఎం రేవంత్ రెడ్డిదే : కేటీఆర్
Today_banner

KTR | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ ప్ర‌మాదం.. పూర్తి బాధ్య‌త సీఎం రేవంత్ రెడ్డిదే : కేటీఆర్

KTR | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే వ‌హించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే వ‌హించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనం అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడిపోవడం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయి. పైకప్పు కూలిన ఈ ఘటనలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. ఈ...
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. చిక్కుకున్న కార్మికులు వీళ్లే!
Today_banner

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. చిక్కుకున్న కార్మికులు వీళ్లే!

వరంగల్ వాయిస్, నాగర్ కర్నూలు: నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పై కప్పు కూలడంతో అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వివరాలను ప్రకటించింది. సొరంగంలో జర్విసింగ్‌ (పంజాబ్‌), సన్నీసింగ్‌ (జమ్ముకశ్మీర్‌), మనోజ్‌ దోబే (యూపీ), శ్రీనివాసులు, సందీప్‌, సంతోష్‌ జట్కా ఇరాన్‌ చిక్కుకున్నట్లుగా తెలిపింది. వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది వెతుకుతున్నారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన పలువురు కార్మికులను ఈగలపెంట జెన్‌కో ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఎడవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా టన్నెల్‌ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో ముగ్గురు కార్...
Mysterious disease | కొన్నూర్‌లో అంతుచిక్కని వ్యాధి.. మూడు రోజుల్లో 2500 కోళ్లు మృతి
Today_banner

Mysterious disease | కొన్నూర్‌లో అంతుచిక్కని వ్యాధి.. మూడు రోజుల్లో 2500 కోళ్లు మృతి

Mysterious disease | బర్డ్‌ ఫ్లూ కారణంగా ఏపీ (Andhrapradesh) లో పెద్ద సంఖ్యలో ఫారమ్‌ కోళ్లు, నాటు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తెలంగాణ (Telangana) లో కూడా అక్కడక్కడ బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో వనపర్తి (Wanaparthy) జిల్లా మదనపురం (Madanapuram) మండలం కొన్నూర్‌ (Konnur) గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో భారీ సంఖ్యలో కోళ్లు మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. Mysterious disease : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బర్డ్‌ ఫ్లూ (Bird Flu) ప్రమాద ఘంటికలు మోగుతుండగానే.. కొత్తగా మరో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. బర్డ్‌ ఫ్లూ కారణంగా ఏపీ (Andhrapradesh) లో పెద్ద సంఖ్యలో ఫారమ్‌ కోళ్లు, నాటు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తెలంగాణ (Telangana) లో కూడా అక్కడక్కడ బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో వనపర్తి (Wanaparthy) జిల్లా మదనపురం (Madanapuram) మండలం కొన్నూర్‌ (Konnur) గ్రామంల...
Gandhi Bhavan | రుణ‌మాఫీ కాలేదంటూ.. గాంధీ భ‌వ‌న్ మెట్ల మీద వృద్ధ రైతు ధ‌ర్నా..
Today_banner

Gandhi Bhavan | రుణ‌మాఫీ కాలేదంటూ.. గాంధీ భ‌వ‌న్ మెట్ల మీద వృద్ధ రైతు ధ‌ర్నా..

Gandhi Bhavan | కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి మాట‌లు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి మాట‌లు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. చాలా మంది రైతుల‌కు రుణ‌మాఫీ కాక‌పోవ‌డంతో.. రేవంత్ స‌ర్కార్‌పై ఆగ్ర‌హంతో ఉన్నారు. అవ‌కాశం ఉన్న చోట రైతులు నిర‌స‌న తెలుపుతున్నారు. తాజాగా ఓ వృద్ధ రైతు.. హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌కు చేరుకుని ధ‌ర్నాకు దిగాడు. త‌న‌కు రుణ‌మాఫీ చేసే వ‌ర‌కు ఇక్క‌డ్నుంచి క‌దిలేది లేద‌ని ఆ రైతు తేల్చిచెప్పాడు. త‌న పేరు తోట యాద‌గిరి శాలిగౌరారం మండ‌లం తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం.. 55 క్వింటాళ్ల 80 కిలోల ధాన్యాన్ని విక్ర‌యించాను. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు బోన‌స్ రాలేదు. అంతే కా...
Omar Abdullah | ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఒమర్‌ అబ్దుల్లా.. ఇకపై కారులో వెళ్లబోనని స్పష్టం
Today_banner

Omar Abdullah | ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఒమర్‌ అబ్దుల్లా.. ఇకపై కారులో వెళ్లబోనని స్పష్టం

Omar Abdullah | జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా మరోసారి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. చాలా సమయం ఆదా అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై కారులో వెళ్లబోనని అన్నారు. వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మరోసారి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. చాలా సమయం ఆదా అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై కారులో వెళ్లబోనని అన్నారు. దక్షిణాసియా ట్రావెల్ అండ్‌ టూరిజం ఎక్స్ఛేంజ్ SATTE 2025 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒమర్‌ అబ్దుల్లా ఢిల్లీకి వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. టూరిజం ప్రమోషన్ ఈవెంట్‌ జరిగే యశోభూమికి 25 నిమిషాల్లో చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, అక్కడకు చేరుకోవడానికి కారులో గంటన్నర కంటే ఎక్కువ సమయం పడుతుందని ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. మెట్రో రైల...
తెలంగాణ‌ హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా న్యాయ‌వాదికి గుండెపోటు
Today_banner

తెలంగాణ‌ హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా న్యాయ‌వాదికి గుండెపోటు

తెలంగాణ హైకోర్టులో విషాదం నెల‌కొంది. హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా ఓ న్యాయ‌వాది గుండెపోటుకు గుర‌య్యాడు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టులో విషాదం నెల‌కొంది. హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా ఓ న్యాయ‌వాది గుండెపోటుకు గుర‌య్యాడు. కోర్టు హాలులోనే న్యాయ‌వాది కుప్ప‌కూలిపోయాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జ‌డ్జి, ఇత‌ర న్యాయ‌వాదులు.. బాధిత న్యాయ‌వాదిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే న్యాయ‌వాది మృతి చెందిన‌ట్లు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన న్యాయ‌వాదిని వేణుగోపాల‌రావుగా గుర్తించారు. సంతాపంగా 21వ కోర్టు హాలులో జ‌డ్జి విచార‌ణ‌ను నిలిపివేశారు. మిగిలిన కోర్టు హాళ్ల‌లోనూ రెగ్యుల‌ర్ పిటిష‌న్ల‌ను వాయిదా వేశారు. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. న్యాయ‌వాది వేణుగోపాల‌రావు మృతిప‌ట్ల హైకోర్టు జ‌డ్జిలు, న్యాయ‌వాదులు, సిబ...
Maha Kumbh | ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న ‘మహా’రద్దీ.. 37 రోజుల్లో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు
Today_banner

Maha Kumbh | ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న ‘మహా’రద్దీ.. 37 రోజుల్లో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు

Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మేళా మరో ఎనిమిది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తాకిడి పెరిగింది. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకూ 69 లక్షల మంది నదీ స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ డేటా ప్రకారం.. మొత్తంగా 37 రోజుల్లో 55.31 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. కాగా, వారాంతం త‌ర్వాత ర‌ద్దీ త‌గ్గుతుంద‌ని అంతా భావించారు.. అయితే, సోమ‌వారం ఒక్కరోజే ఏకంగా కోటి మందికి పైగా భ‌క్తులు మ‌హా కుంభ‌మేళాకు వ‌చ్చార...
BRS Party | మునుపటి ఛరిష్మా వచ్చేనా..!
Today_banner

BRS Party | మునుపటి ఛరిష్మా వచ్చేనా..!

బీసీ నినాదం ఎత్తుకున్న బీఆర్‌ఎస్‌ స్థానిక ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం సవాళ్లు విసురుతున్న నేతలు లేకుంటే పార్టీ మనుగడ కష్టమంటున్ననేతలు ఉద్యమ పార్టీ అయిన తమకు తెలంగాణలో తిరుగులేదని విర్రవీగిన బీఆర్ఎస్ ను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాచి వాత పెట్టారు. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఎదురుదాడి రాజకీయాలు తప్ప మరోటి కానరావడం లేదు. వివిధ అవినీతి కేసులతో పార్టీ పరువు బజారున పడుతున్న వేళ ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. కేసులనుంచి బయట పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో ఉన్నవారు ఇతర పార్టీలోకి జారుకోకుండా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడిన వారిని కోర్టుకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రానున్న స్థానిక ఎన్నికల్లో గెలిస్తే తప్ప బీఆర్‌ఎస్‌ మనుగడ కష్టమని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితి కన్నా దారుణంగా ఉంటుందని అభిప్ర...