తిన్నంత అనారోగ్యం
ఓరుగల్లులో కల్తీ ఆహారం
విచ్చల విడిగా వెలుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు
అనారోగ్యకరమైన నూనెలు, రంగుల వాడకం
కస్టమర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో తేటతెల్లం
చిరుజల్లులు కురుస్తున్నాయని వేడి వేడిగా బయట ఏదైనా తినాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించాల్సిందే! ఎందుకంటే కంటికి ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలన్నీ మేలైనవి కావు. సాధారణ హోటళ్లలోనే ఇలాంటి పరిస్థితి అనుకుంటే పొరపడినట్లే. ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. తిండి దగ్గర నుంచి వడ్డించే గిన్నెల వరకూ అన్నీ అపరిశుభ్రమేనని ఇటీవల టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో వెల్లడైంది. దనార్జనే లక్ష్యంగా హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తక్కువ ధరకు లభించే నాసిరకం వంట నూనెలు, రంగులు, కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, కాలం చెల్లిన స్పైసెస్ వాడుతున్నట్లున్నట్లు తేల్చి చెప్పారు. ఇవి కస్టమర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరంగల్ ...









