Warangalvoice

Today_banner

స్వేచ్ఛా భారతం: గత వైభవం, వర్తమాన ప్రగతి, భవిష్యత్ ఆశయాలు
Today_banner

స్వేచ్ఛా భారతం: గత వైభవం, వర్తమాన ప్రగతి, భవిష్యత్ ఆశయాలు

వరంగల్ వాయిస్, వరంగల్ :  భారతదేశం తన 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభసమయంలో, మన హృదయాలు గతాన్ని గుర్తు చేసుకుంటూ, వర్తమానాన్ని గర్వంగా చూస్తూ, భవిష్యత్తుపై అపారమైన ఆశలతో నిండిపోతాయి. నేడు మనం ఎగురవేస్తున్న త్రివర్ణ పతాకం కేవలం ఒక జెండా కాదు, అది లక్షలాది మంది వీరుల త్యాగాలకు, అలుపెరగని పోరాటాలకు, అపారమైన ఆశలకు ప్రతీక. ఈ పతాకం మన స్వేచ్ఛకు చిహ్నంగా రెపరెపలాడుతున్న ప్రతిసారీ, మనం గడిచిన ప్రయాణాన్ని, నేటి బాధ్యతను, రేపటి కర్తవ్యాన్ని మననం చేసుకోవడం అనివార్యం. ఈ పత్రికా సంపాదకీయం, గత వైభవాన్ని స్మరించుకుంటూ, వర్తమాన సవాళ్లను విశ్లేషిస్తూ, భవిష్యత్ నిర్మాణంలో యువశక్తి పాత్రను వివరిస్తుంది.గతం: త్యాగాల పునాదులపై స్వాతంత్ర్య సౌధంమనం స్వాతంత్ర్యం పొంది 78 సంవత్సరాలు పూర్తయిన ఈ తరుణంలో, రెండు శతాబ్దాలకు పైగా బ్రిటిష్ పాలనలో మగ్గిన మన దేశపు గతాన్ని విస్మరించలేము. ఆనాటి ప్రజల జీవితాల...
మాడిన అన్నం.. గొడ్డు కారం..
Mahabubabad, Today_banner

మాడిన అన్నం.. గొడ్డు కారం..

ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలో ఆహారం తినలేక పస్తులుంటున్న విద్యార్థులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీతో వెలుగులోకి మన బిడ్డలకు ఇలాగే పెడతామా అంటూ నిలదీత సాక్షాత్తు కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం నిత్యం సంచరించే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలోని విద్యార్థినులకు మాడిన అన్నం..గొడ్డు కారమే దిక్కైంది. తింటే తిను లేకుంటే పస్తులుండు అన్నట్లుగా అక్కడి వార్డెన్లు వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఒకవైపు విద్యార్థులకు మెరుగైన భోజనం వడ్డిస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అది అమలుకు నోచుకోవడం లేదు. కలెక్టర్లు గురుకులాలను నెలకోసారి విజిట్ చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడంలేదు. కలెక్టర్లు, ఇతర అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వస్తున్నారని ముందే తెలుసుకుంటున్న గురుకులం నిర్వాహకులు ఆ ఒక్క పూట మాత్రం విద్...
గూడు కోసం గోడు
Today_banner, Warangal_TriCites

గూడు కోసం గోడు

ఇందిరమ్మ ఇల్లు" పేరుతో అధికారుల చెలగాటం దామెర మండలం కోగిల్వాయిలో దారుణం ప్రోసిడిండ్ కాపీ వచ్చిందని ఇల్లు నేలమట్టం వానాకాలంలో నిరాశ్రయులైన బాధితులు న్యాయం చేయాలని వేడుకోలు వరంగల్ వాయిస్, దామెర : ఒకవైపు వానాకాలం ప్రారంభమై ప్రజలను బెంబేలెత్తిస్తుంటే, మరోవైపు ఇందిరమ్మ ఇల్లు ఆశ చూపి, ఉన్న గూడును కూడా కోల్పోయేలా చేసిన ఒక దురదృష్టకర సంఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం కోయిలవాయి గ్రామంలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల తమ పాత ఇంటిని కూల్చుకుని, ప్రస్తుతం నిరాశ్రయులైన ఒక కుటుంబం న్యాయం కోసం వేడుకుంటోంది. ఉన్న ఇల్లును కోల్పోయిన కుటుంబం కోయిలవాయి గ్రామానికి చెందిన పోటు సునీత, రవి దంపతులకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి సరళ తెలియజేశారు. మంజూరు కాపీని కూడా అందజేసిన కార్యదర్శి, పాత రేకుల ఇల్లును కూల్చి కొత్త ఇంటిని త్వరితగతిన నిర్మించుకోవాలన...
chahath bajpai – చాలెంజింగ్ ఆఫీసర్.. చాహత్ బాజ్ పాయ్
Today_banner, Warangal_TriCites

chahath bajpai – చాలెంజింగ్ ఆఫీసర్.. చాహత్ బాజ్ పాయ్

ఆకస్మిక తనిఖీలతో హల్ చల్ అక్రమార్కులపై ఉక్కుపాదం పాలనలో పట్టు భిగిస్తున్న ఐఏఎస్ గ్రేటర్ కమిషనర్ గా తనదైన ముద్ర మరో శాలినీమిశ్రా అంటూ కితాబు గ్రేటర్ వరంగల్ కు ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. అందులో కొందరు మాత్రమే నగర ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. నగరాభివృద్ధిలో వారి మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకునే పేరు శాలినీ మిశ్రా అయితే అదే స్థాయిలో అధికారులను పరుగులు పెట్టిస్తూ పాలనను చక్కదిద్దే పనిలో పడ్డారు ప్రస్తుత కమిషనర్ చాహత్ బాజ్ పాయ్. 13 జూన్ 2025న విధుల్లో చేరిన కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గ్రేటర్ పరిధిలోని అన్ని రంగాలపై పట్టు సాధిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. పడకేసిన స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాలను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు. శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి...
23న ‘లోకల్’ కోడ్!
Political, Today_banner

23న ‘లోకల్’ కోడ్!

స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోండి కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్ పోలింగ్ సిబ్బంది వివరాలు మరోసారి పరిశీలించాలంటూ ఆదేశం గ్రామాల్లో మొదలైన సందడి పెరిగిన ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తాజాగా జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలంటూ సూచించింది. పోలింగ్ సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో ఈనెల 23న స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రానున్నట్లు ప్రచారం సాగుతోంది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులకు అవసరమైన సూచనలు కూడా చేసింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు ని...
చినుకు రాలదు.. చింత తీరదు
Agriculture, Today_banner

చినుకు రాలదు.. చింత తీరదు

ముఖం చాటేసిన వరుణుడు జూలై ప్రారంభమై రెండు వారాలైనా వర్షాలు కరువే చుక్క నీరు లేక వెలవెలబోతున్న వాగులు, చెరువులు వర్షాభావంతో ప్రారంభం కాని వరి నాట్లు పత్తి మొక్కలకు బిందెలతో నీళ్లు వానాకాలం సీజన్ ప్రారంభమై అప్పుడే 45 రోజులు గడిచిపోయింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే నెల చివరి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా భారీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. గత కొన్ని సంవత్సరాలుగా జూలై నెలలోనే భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు నిండు కుండల్లా కనిపించేవి. కానీ ఈ సంవత్సరం జూలై రెండో వారం ముగిసినప్పటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యవసాయానికి పనికివచ్చే వర్షం నమోదు కాకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు వేసవిని తలపించేలా ఎండలు, నెర్రెలుబారిన పంట పొలాలు వ్యవసాయ రంగంపై నీలి నీడలను కమ్మేస్తున్నాయి. ఇప్పటికే...
రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగ్స్
Today_banner

రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగ్స్

రాత్రి వేళల్లో హల్ చల్ వాహనదారులను వెంబడించి దాడులు నియంత్రించడంలో పోలీసుల విఫలం నైట్ పెట్రోలింగ్ లకు మంగళం విస్తరిస్తున్న విక్రయాలు అండర్ రైల్వే గేటు ప్రాంతంలో గంజాయి గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి. ముగ్గురు, నలుగురు గుంపులుగా ఏర్పడి రాత్రి వేళల్లో హల్ చల్ చేస్తున్నారు. వాహనదారులను వెంబడించి దాడులకు పాల్పడుతున్నారు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైనే దాడులకు దిగుతున్నారు. నిన్నటికి నిన్న గవిచర్ల క్రాస్ రోడ్ లో 11 మంది యువకులు గంజాయి మత్తులో ఇద్దరిని విచక్షణా రహితంగా కొట్టి పరారయ్యారు. పలువురు మహిళలు సైతం గంజాయి గ్యాంగ్ ఆగడాలకు అవమానాలపాలైన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేందుకు సాహసించని వారెంతోమంది తమలో తామే కుమిలిపోతున్నారు. గంజాయి గ్యాంగ్ ల అకృత్యాలు అదుపు చేయాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. నైట్ ప్రెట్రోలింగ్...
ఎస్సారెస్పీ..  కాలువ కబ్జా
Latest News, Today_banner

ఎస్సారెస్పీ.. కాలువ కబ్జా

ప్లాట్లుగా చేసి విక్రయాలు రెచ్చిపోతున్న రియల్టర్లు అటకెక్కిన గ్రీవెన్స్ ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించినా చర్యలు శూన్యం నిద్ర మత్తు వీడని ఇరిగేషన్ అధికారులు ఆందోళనలో రైతులుపర్వతగిరిలో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. ప్రజా ప్రతినిధుల అండ మెండుగా ఉన్న వారి దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేయడం పరిపాటి. ఇక్కడ మాత్రం ఏకంగా ఎస్సారెస్పీ కాలువనే మట్టితో నింపి ప్లాట్లు చేసి విక్రయిచడం సంచలనంగా మారింది. మండలంలోని పర్వతగిరి-చౌటపల్లి గ్రామ రెవెన్యూ శివారు నుంచి గొరుగుట తండా, జగ్గు తండా మీదుగా పర్వతగిరి రిజర్వాయర్ సమీపం మీదుగా కల్లెడ గ్రామం వరకు విస్తరించి ఉన్న ఎస్సారెస్పీ కాలువను కల్లెడలోని వడ్లకొండ మల్లయ్యకు చెందిన బావి నుంచి ఊర చెరువు వరకు మట్టితో నింపి ప్లాట్లుగా చేసి విక్రయాలు చేస్తున్నారు. కాలువ పూడ్చి వేయడంతో తమ పంట చేలకు నీరు వచ్చే పరిస్థితి లేదన...
శక్తి స్వరూపిణి.. శాకంబరీ
Cultural, Latest News, Today_banner, Warangal_TriCites

శక్తి స్వరూపిణి.. శాకంబరీ

కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారి దర్శనం పది టన్నుల కూరగాయలు, ఆకు కూరలతో అలంకరణ పులకించిన భక్తజనం ఆలయానికి పోటెత్తిన భక్తులు కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సురేఖ పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు 300మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన భద్రకాళి అమ్మవారి ఆషాడ మాస శాకంబరీ ఉత్సవాలను గురువారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు జరిగే శాకంబరీ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. పదిహేను రోజులపాటు ఉదయం, సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులను వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేశారు. చివరి రోజైన ఆషాఢ శుద్ధపౌర్ణమి అయిన గురుపౌర్ణమి పర్వదినాన అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో శాకంబరీగా అలంకరించారు. భద్రకాళి ఆలయానికి ఉదయం 10 గంటలకు చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వ...
మూతపడి ఐదేళ్లు
Today_banner

మూతపడి ఐదేళ్లు

మ్యూజికల్ గార్డెన్ కుముహూర్తమెప్పుడో? కరోనా సమయంలో గేటుకు తాళం ఇప్పటికీ తెరుచుకోని వైనం రూ.3కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి ఓపెనింగ్ కు ఎదురుచూపులు ఉరుకులు, పరుగుల జీవితం గడుపుతున్న నగర ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలన్న లక్ష్యంతో వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన కాకతీయ మ్యూజికల్ గార్డెన్ మూతబడి ఐదేళ్లు కావస్తోంది. కరోనా సమయంలో గేటుకు వేసిన తాళం ఇప్పటికీ తెరుచుకోలేదు. పార్కును అభివృద్ధి చేస్తున్నామంటూ పాలకులు ప్రకటనలు చేయడం తప్ప అవి ఎప్పటి వరకు పూర్తి అవుతాయో ఎవ్వరూ చెప్పడంలేదు. ప్రారంభోత్సవ ముహూర్తం అప్పుడూ.. ఇప్పుడూ అంటూ సంవత్సరాలు గడిచిపోతున్నా తాళం తీసేవారే కరువయ్యారు. 18 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్ ను 1994లో ప్రారంభించారు. భద్రకాళి చెరువు కట్టను ఆనుకుని సువిశాల స్థలంలో పచ్చని చెట్లతో కలర్ ఫుల్ గా కనిపించేది. ఇందులో ఏ...