చినుకు రాలదు.. చింత తీరదు
ముఖం చాటేసిన వరుణుడు
జూలై ప్రారంభమై రెండు వారాలైనా వర్షాలు కరువే
చుక్క నీరు లేక వెలవెలబోతున్న వాగులు, చెరువులు
వర్షాభావంతో ప్రారంభం కాని వరి నాట్లు
పత్తి మొక్కలకు బిందెలతో నీళ్లు
వానాకాలం సీజన్ ప్రారంభమై అప్పుడే 45 రోజులు గడిచిపోయింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే నెల చివరి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా భారీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. గత కొన్ని సంవత్సరాలుగా జూలై నెలలోనే భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు నిండు కుండల్లా కనిపించేవి. కానీ ఈ సంవత్సరం జూలై రెండో వారం ముగిసినప్పటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యవసాయానికి పనికివచ్చే వర్షం నమోదు కాకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు వేసవిని తలపించేలా ఎండలు, నెర్రెలుబారిన పంట పొలాలు వ్యవసాయ రంగంపై నీలి నీడలను కమ్మేస్తున్నాయి. ఇప్పటికే...