Warangalvoice

CAG Report | కాగ్‌ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

  • 023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదికను (CAG Report) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు.

వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదికను (CAG Report) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం అయిందని తెలిపారు. జీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంగా పేర్కొన్నారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం ఖర్చయిందని తెలిపారు. ప్రభుత్వం అదనంగా రూ.1,11,477 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ద్వారా ప్రభుత్వం రూ.10,156 కోట్లు తీసుకున్నదని, రూ.35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్‌ను 145 రోజుల పాటు వాడుకున్నదని తెలిపారు.

కాగ్‌ నివేదికలో ఇంకా ఏముందంటే..

  • 2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం రూ.24,347 కోట్ల వ్యయం
  • వేతనాలకు రూ.26,981 కోట్లు ఖర్చు
  • ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు
  • 2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం రూ.9934 కోట్లు
  • రెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పింఛన్లకే ఖర్చు
  • రెవెన్యూ మిగులు రూ.779 కోట్లు, రెవెన్యూ లోటు రూ.49,977 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.33
  • 2023-24 ఆర్థిక ఏడాది ముగిసే వరకు రుణాల మొత్తం 4,03,664 కోట్లు
  • 2023-24 ముగిసే నాటికి జీఎస్డీపీలో అప్పులు 27 శాతం
  • 2023-24 వరకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం రూ.2,20,607 కోట్లు
  • 2023-24లో మూలధనం కింద రూ.43,918 కోట్ల ఖర్చు
  • స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు రూ.76,773 కోట్లు
  • స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో 11 శాతం పెరుగుదల
Mallu Bhatti Vikramarka Introduced Cag Report In Assembly
Mallu Bhatti Vikramarka Introduced Cag Report In Assembly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *