
వరంగల్ వాయిస్, దామెర:
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒగ్లాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి దుర్గంపేట సర్పంచ్ దాసి శ్రీకాంత్ అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తడి పొడి చెత్తను వేరు చేయటం గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు ఇంటి పరిసర ప్రాంతాలలో చెత్తాచెదారం లేకుండా మురుగునీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు పరిసరాలను శుభ్రంగా లేనిచో దుర్వాసనతో పాటు దోమలు చేరి అనారోగ్య నికి దారితీస్తాయని దానితో ఆర్థికంగా నష్టపోతామని అన్నారు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరం అన్నారు గ్రామ ప్రజలందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని తద్వారా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మార్చుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో కార్యదర్శులు ఇంజపెల్లి నరేష్, సుకన్య, కారో
బార్లు వెంకన్న, శీను, కిన్నెర రమేష్, నూనె కిషన్, మహిళా సంఘ సభ్యులు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.