
వరంగల్ వాయిస్, దామెర:
మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం ముదిరాజులు పెద్దమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం సభ్యులందరూ కొత్త దుస్తులను ధరించి బంధుమిత్రులు కుటుంబ సభ్యులు ఆనందంతో కొబ్బరికాయలు నైవేద్యం అమ్మవారికి సమర్పించి సాంప్రదాయం ప్రకారం యాట పిల్లలతో డప్పు చప్పుళ్లతో మొక్కులను సమర్పించి గ్రామ ప్రజలను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని పాడి పంటలతో తులతూగాలని అమ్మవారిని వారు వేడుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగిరి రాజు, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు భూస సారంగం, ఉపాధ్యక్షుడు గోల్కొండ శ్రీనాథ్, ఉప సర్పంచ్ గోల్కొండ రమేష్, సంఘం డైరెక్టర్లు శ్రీను, సతీష్, శ్రీనివాస్, రాజు, రజనీకాంత్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.