
వరంగల్ వాయిస్, దామెర: దామెర మండలం కోగీల్వాయి గ్రామ పరిధిలోని శ్రీ చంద్రగిరి చెన్నకేశవ స్వామి జాతరను పురస్కరించుకొని, ఉత్సవాల నిర్వహణ కోసం నూతన జాతర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం గ్రామ సర్పంచ్ చుక్క వనిత మహేందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, భక్తుల సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. గౌరవ అధ్యక్షులుగా పెరుగు కుమారస్వామి యాదవ్, చైర్మన్ గా రమాకాంత్, వైస్ చైర్మన్లుగా పున్నం వేణు, జయశంకర్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పెరుగు కుమారస్వామి మాట్లాడుతూ.. చంద్రగిరి చెన్నకేశవ స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి, జాతర వైభవానికి తమ కమిటీ శాయశక్తులా కృషి చేస్తుందని తెలిపారు. వచ్చే శనివారం జరగబోయే ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. జాతర ఏర్పాట్లలో గ్రామస్తులందరూ సమన్వయంతో పనిచేయాలని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు వంటి కనీస వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.