
ఒగ్లాపూర్ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి
వరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం నూతన నర్సరీ పనులను సర్పంచ్ కేతిరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపే లక్ష్యంతో, రాబోయే వర్షాకాలం నాటికి లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పచ్చదనం పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద నర్సరీలో వివిధ రకాల పండ్ల, నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. సకాలంలో మొక్కలను సిద్ధం చేసి నాటడం ద్వారా ఒగ్లాపూర్‌ను ఆదర్శ హరిత గ్రామంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, ఉపసర్పంచ్ కిన్నెర దినేష్ కుమార్, వార్డు సభ్యులు నూనె తిరుపతి, కిన్నెర కోటి పాల్గొన్నారు. వీరితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ నల్ల శంకర్, గ్రామ పంచాయతీ కారోబార్ శ్రీనివాస్, గ్రామస్థులు కిన్నెర రమేష్, కనుకుంట్ల నరేష్, నల్ల దయాకర్, అఖిల్ పాషా, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.