వరంగల్ వాయిస్, దామెర :
మండలంలోని పులుకుర్తి గ్రామ నివాసి దండు సురేందర్ ఇటీవల అకాల మరణం చెందడం పట్ల మండల యూత్ బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఉపసర్పంచ్ పెంచాల రాజేందర్ (మెంతుల రాజు) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం సురేందర్ గృహాన్ని సందర్శించిన ఆయన, మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. సురేందర్ మరణం గ్రామస్థులకు మరియు వారి కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా ఎల్లవేళలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. నాయకులు కాశెట్టి సదానందం, ఈదునూరి స్వామి, రాజు, ఆనంద్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
