Warangalvoice

ముగిసిన 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య.


వరంగల్ వాయిస్, పర్వతగిరి : గత మూడు రోజులుగా అన్నారం పల్లవి మోడల్ పాఠశాలలో జరుగుతున్న 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడోత్సవాలు ముగిసినట్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య తెలిపారు. 1200 మంది క్రీడాకారులు పాల్గొన ఈ పోటీలలో సుమారు 100 మంది టెక్నికల్ సహాయకులు సేవలందించారు. మహిళ విభాగంలో మొదటి స్థానం నల్గొండ జట్టు గెలువగా రెండవ స్థానంలో మహబూబాబాద్ టీమ్, మూడవ స్థానంలో నారాయణపేట టీమ్  నిలిచాయి. పురుషుల విభాగంలో మొదటి స్థానం యాదాద్రి భువనగిరి జట్టు విజయం సాధించిగా,  రెండవ స్థానం సంగారెడ్డి, మూడవ స్థానం హైదరాబాద్ జట్టు నిలిచాయి. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు మహారాష్ట్రలో జరగబోయే జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. చివరి రోజున స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్రీడాలను సందర్శించి విన్నర్, రన్నర్ క్రీడాకారులను షిల్డ్ బహుమతి అందజేసి అభినందించారు. సుమారుగా 1000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ  పోటీలలో క్రీడాకారులు తమ అత్యుత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు అందిపుచుకోవాలని కోరారు. షూటింగ్ బాల్ అనే క్రీడకు భారతదేశంలో అన్ని సెంట్రల్  డిపార్టుమెంటులో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ క్రీడను తెలంగాణ రాష్ట్రంలో ఇంప్రూవ్మెంట్ చేసినట్లయితే తెలంగాణ క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. గెలుపోటములు సహజమని ప్రతి ఒక్క క్రీడాకారుడు ప్రతిభను ఆధారంగా చేసుకొని గెలుపు ఓటలను సమానస్ఫూర్తితో తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. వైభవొపేతంగా జరిగినటువంటి ఈ క్రీడలు అన్నారం గ్రామానికి శోభ తెచ్చినట్టు తెలిపారు. ఇంత మారుమూల గ్రామమైనప్పటికీ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతులు కల్పించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్, స్థానిక గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక చారి, డైరెక్టర్లు గంజి మహేందర్, కోటగిరి రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రశాంత్, క్రీడా ఇంచార్జ్, ఎచ్ఓడి ఆకుల రాజు, ఏఓ బైరీ అశోక్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *