Warangalvoice

విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలి


వరంగల్ వాయిస్ , దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగులాపూర్ గ్రామ పరిధిలోని డిస్నీల్యాండ్ హై స్కూల్ 25వ వార్షికోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకల్లో ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి  పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిస్నీల్యాండ్ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థులు పాఠశాల దశలోనే ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు పట్టుదలతో శ్రమించాలని అన్నారు. విద్యార్థులు పట్టుదలతో సాధిస్తే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు.నేటి బాలలే రేపటి పౌరులని, విద్యతో పాటు విలువలు అవసరమని పేర్కొంటూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేతుపల్లి శ్రీధర్రెడ్డి, పాఠశాల కర స్పాండెంట్ బి. శోభారాణి, పాఠశాల వ్యవస్థా పకులు బి.లక్ష్మీనివాసం, చీఫ్ అడ్వైజర్ బి. పవన్, విజయలక్ష్మీ, భానుచందర్, బుద్ధదేవ్ సూరజ్, హరిత, రాజు, మౌనిక, ఈశ్వర్, కావ్య, మీనా, శ్రీలత, శ్రావణి, డి.రాకేశ్భా ను, డి.దినేష్ చందర్, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *