Warangalvoice

హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో డిబిఎస్ శస్త్ర చికిత్స విజయవంతం

వరంగల్ వాయిస్,హనుమకొండ :పారికిన్ సన్ వ్యాధి వణుకుడు వ్యాధి ప్రపంచంలో అత్యంత సాధారణ న్యూరో జనరేటిక్ వ్యాధి ఇది మన దేశంలో ప్రతి లక్ష జనాభాలలో 42% నుంచి 60% ప్రజలు వ్యాధితో బాధపడుతున్నారని నూరాలోజిస్ట్, ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ రూపం బోర్గాని అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కల గుట్ట లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లో వారు మాట్లాడుతూ పారీ కిన్ సన్ వ్యాధి హుజురాబాద్ కు చెందిన అశోక్ రెడ్డి సుమారు మూడు సంవత్సరాల క్రీతం, కాజిపేట కు చెందిన సంగీత సంవత్సరంన్నార క్రీతం వ్యాధి రావడంతో హైదరాబాద్ హై -టెక్ సిటీ యశోదహాస్పిటల్ లోని చేరగా మా యొక్క వైద్య బృందం తో డీప్ బ్రెయిన్ స్టిమ్యూలేషన్ (డి బి ఎస్) శస్త్ర చికిత్స ను విజయ వంతం చేశామని తెలిపారు. ఇప్పుడు పేషేంట్ లు ఆరోగ్యం గా ఉన్నారని అన్నారు.డి బి ఎస్ యొక్క పాత్ర జబ్బు బిపి షుగర్ వ్యాధి లాగా జీవితాంతం ఉంటుందని ఈ వ్యాధి లక్షణాలు ప్రతి సంవత్సరం పెరుగుతుందని తెలిపారు.మొదట మూడు లేదా నాలుగు సంవత్సరాల వరకు మందులతో ఫలితం కనబడుతుందని తర్వాత మందల ప్రభావం క్షణిస్తుందన్నారు.ఈ సమయంలో యూ ఎస్ ఎఫ్ డి ఏ,డీజీసీఐ ప్రమాణం ద్వారా పొందిన ఏకైక చికిత్స ఈ డిబిఎస్( డూప్ బ్రెయిన్ స్టేములేషన్ )తో ఈ వ్యాధి లక్షణాలను సమర్దమంతా తగ్గించవచ్చని తెలిపారు.డిబిఎస్ 30 సంవత్సరాల పాటు ఉపయోగించబడిందని,జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో అద్భుతమైన ఫలితాలు చూపించిందన్నారు.ఇది మెదడులో నిర్దిష్ట భాగంలో ఎలక్ట్రోడ్ అమర్చడం, వాటిని ఛాతి లోని చిన్న పరికరానికి కనెక్ట్ చేయడం ద్వారా చేసే ఇది ప్రక్రియ అని అన్నారు.హైదరాబాద్ హైటెక్ సిటీ లోని యశోద హాస్పిటల్ లోని గత 30 సంవత్సరాలుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 4000 పడకలు కలిగి హైటెక్ సిటీ, సోమాజిగూడ, మలక్ పేట, సికింద్రాబాద్ లలో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అరుదైన, సంక్లిష్టమైన విధానాలకు కూడా సంపూర్ణ మిళిత విప్లమాత్మక సాంకేతిక ద్వారా చికిత్సలను అందిస్తుందన్నారు.భారతదేశంలోనే అతిపెద్ద విద్యా సదుపాయాలతో ఒకటిగా భావిస్తున్న తెలంగాణలోని హైదరాబాదులోని 4వేల పడకల సావర్థంతో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో విస్తరించి ఉందని సరసమైన ఖర్చులతో యశోద హాస్పిటల్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో లో న్యూరో సర్జన్, క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ అలుగోలు రాజేష్, రిజిస్టార్ డాక్టర్ ప్రసాద్,సాయి వెంకట్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *