
* ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస నైపుణ్య శిక్షణ శిబిరం
* శిక్షణ పొందిన వారికి అవార్డుల ప్రధానం
వరంగల్ వాయిస్ (కుమార్ పల్లి హనుమకొండ సెప్టెంబర్ 25) :
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సైకాలజిస్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి హనుమకొండ జిల్లా కుమార్ పల్లి లోని డైమండ్ హిల్ బ్యాంకేట్ హాల్ హాల్ నందు రెండు రోజుల సదస్సును నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డుల ప్రధానం జరిగింది.
ఈ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రైమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లర్నింగ్ వ్యవస్థాపకుడు రఘు రాఘవేంద్ర స్వామిని అభినందిస్తూ ముఖ్య అతిధులచే అవార్డు మరియు సర్టిఫికెట్ను బహుకరించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కు చెందిన నేషనల్ ప్రెసిడెంట్ కె మాధవి ఆర్గనైజింగ్ సెక్రటరీ కె రామచంద్రుడు నేషనల్ హెడ్ బోర్డు మెంబర్ చెల్లోజు శ్రీనివాస్ మరియు గాజుల సునీల్ కుమార్ మరియు వరంగల్ 15 రీజినల్ ప్రెసిడెంట్ శ్రీరంగం జయంత్ లతోపాటు విశిష్ట అతిథిగా హనుమకొండ ఎస్సై సతీష్ గారు కూడా పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు.
ఇకపై రఘు రాఘవేంద్ర స్వామి ఇంపాక్ట్ ఫౌండేషన్ తరపున వ్యక్తిత్వ వికాస నిపుణులుగా మరియు మోటివేషన్ స్పీకర్ గా వివిధ విద్యాసంస్థల్లో మరియు కార్యాలయాల్లో శిక్షణ ఇవ్వడానికి అర్హుడని ఇంపాక్ట్ ఫౌండేషన్ నిర్వాహకులు ప్రకటించారు.