
వరంగల్ వాయిస్, దామెర: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఓగ్లాపూర్ గ్రామ లో శివాలయం వద్ద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు స్పెషల్ ఆఫీర్ రంగాచారి పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆడపడుచులు ఆటపాటలతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో మహిళలు తీరొక్కా పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆటల పాటలతో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. వివిధ దేశాలలో ఉంటున్న తెలంగాణ రాష్ట్ర మహిళలు కూడా బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకుంటున్నారంటే తెలంగాణలోని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా వ్యాపించిందని అన్నారు. పితృ అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ మహిళలు ఆడుతారని అనంతరం సద్దుల బతుకమ్మతో ముగుస్తుందని తెలిపారు.