
వరంగల్ వాయిస్, దామెర:
సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని డిస్నీల్యాండ్ హై స్కూల్ ఒగ్లాపూర్ లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో ఉన్న 200 మంది విద్యార్థినిలు మరియు 650 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరితో పాటు పాఠశాల యాజమాన్యం మరియు కుటుంబ సభ్యులు శోభారాణి, విజయలక్ష్మి,కావ్య,మీన,రచన, హరితా భాను లు పాల్గొని మన తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ మన సద్దుల బతుకమ్మ అని, వీటితో పాటు అన్ని పండుగల ఉత్సవాలను చేసుకోవాలని, మన ఆచార, సంస్కృతులను ఎప్పటికీ మరువకూడదని తెలియ చేసారు. పాఠశాల యాజమాన్యం,ఉపాధ్యాయిని లు, విద్యార్ధినులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేసి కన్నుల పండుగలా జరుపుకున్నారు.