వరంగల్ వాయిస్, దామెర:
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం విద్య అందించాలని దామెర ఎమ్మార్వో జ్యోతి వరలక్ష్మి దేవి అన్నారు. బుధవారము దామెర మండలంలోని ఓగ్లాపూర్ ఎస్బిఐటి ఆవరణలో గల మైనారిటీ పాఠశాల మరియు మాత్మ గాంధీ జ్యోతిరావు పూలే ఆశ్రమ పాఠశాలలలోని విద్యార్థులకు తయారు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపును పరిశీలించి ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల పరిసర ప్రాంతాలను వంట గదులను పరిశీలించి నాణ్యమైన కూరగాయలతో రుచికరంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వైద్య బృందం, ఆర్ఐసంపతిరావు, జిపిఓ హరిప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
