వరంగల్ వాయిస్, దామెర : రుణాల ఎగవేత కారణంగా పెద్దాపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) పాలకవర్గాన్ని రద్దు చేస్తూ జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో పెద్దాపురం సొసైటీ చైర్మన్ బొల్లు రాజు, ఎనిమిది డైరెక్టర్లను పదవుల నుంచి తొలగించారు. దీంతో వీరు పదవులు కొల్పొయారు. మాదారం పీఏసీఎస్ చైర్మన్, ఎనిమిది డైరెకర్లు పీఏసీఎస్ నిధులను దుర్వినియోగం చేశారని ఉత్తర్వుల్లో వివరించారు.
కొత్త ఇంఛార్జిల నియామకం.. నిధుల దుర్వినియోగం, రుణాల ఎగవేత వంటి కారణాలతో రద్దైన ఈ రెండు పీఏసీఎస్‌లకు పర్సన్ ఇంఛార్జిని నియమించినట్లు డీసీఓ సంజీవరెడ్డి తెలిపారు. రద్దు చేయబడిన పాలకవర్గం నుంచి దుర్వినియోగమైన నిధులను తిరిగి రాబట్టడానికి త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.