Warangalvoice

ఘనంగా మాజీ ఎమ్మెల్యే చల్లా జన్మదిన వేడుకలు


వరంగల్ వాయిస్,దామెర
దామెర మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో సోమవారము బిఆర్ఎస్  ఆధ్వర్యంలో ఘనంగా చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముద్దసాని సహోదరు రెడ్డి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రైతులకు యూరియాను అందించలేని స్థితిలో ఉందని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి ఎంపిటి సి స్థానిక గ్రామాల సర్పంచులను  బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు.ఈ నేపథ్యంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దామెర మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేస్తామని కేసీఆర్ వాగ్దానం చేశారని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం జూనియర్ కళాశాల ను మంజూరు చేయాలని ఆయన అన్నారు. మాజీ వైస్ ఎంపీపీ జాకీర్ అలీ మాట్లాడుతూ పరకాల అభివృద్ధి ప్రదాత చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే పరకాల  నియోజక వర్గాన్ని  అభివృద్ధిలోముందు  నిలిపారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాగితాల శంకర్, పిఎసిఏ చైర్మన్ బొల్లు రాజు, సోనబోయిన రాజు( కెసీఆర్) దామెర ఉప్పుల శంకర్, పున్నం సంపత్,  దాడి మల్లయ్య,గరిగే కృష్ణమూర్తి, సానా రాజు, కిన్నెర, చరణ్, రాకేష్, రమేష్,దామెర కుమార్,ప్రసాద్ తదితర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *