
వరంగల్ వాయిస్, దామెర: హనుమకొండ జిల్లా మండల కేంద్రంలోదమ్మన్నపేట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకుడు దుబాసి నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయంలో అభిషేకం అర్చన కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు బిక్షపతి, అనిల్, రఘుపతి రెడ్డి, రాజు, ప్రమోదు, రాజు, నాగరాజు, బాలయ్య, శ్రావణ్, తిరుపతి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.