
వరంగల్ వాయిస్, దామెర:
దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామం లోని కాపు వాడలో నెలకొల్పిన గణేష్ మండపం వద్ద ఆకుల శోభా కుమారస్వామి పుణ్య దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రసాదం వితరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దామెర ఎస్సై కొంక అశోక్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఎస్సై అశోక్ ని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కనుకుంట్ల జీవన్ రావు, ఆకుల రవీందర్, మాజీ ఉపసర్పంచ్ ఆకుల కుమారస్వామి,ఆకుల కోటి, కనుకుంట్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.