
వరంగల్ వాయిస్, హనుమకొండ :హనుమకొండ లోని నయీమ్ నగర్ లోని జాగృతి కాలనీ, లోటస్ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా మట్టి గణపతి కి రెండో బహుమతి లభించింది. గణపతి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణపతి మండపాల నిర్వాహకులకు కాళోజి కళాక్షేత్రంలో బహుమతుల ప్రధానం గురువారం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా నిర్వాహకులు ఈ అవార్డు అందుకున్నారు. అధ్యక్షులు అంచూరి విజయకుమార్ ,కార్యదర్శి బింగి సతీష్ , లోటస్ కాలనీ, జాగృతి కాలనీ అధ్యక్షులు నల్ల సత్యనారాయణ, గౌరవాధ్యక్షులు కర్ర రాజా మల్లారెడ్డి , దోనకొండ రమణారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి , కర్ర రమణారెడ్డి , మాధవ రెడ్డి , శనిగరపు విజయ్ కుమార్ తదితర ప్రముఖులు, కాలనీవాసులందరూ ప్రత్యేకంగా పాల్గొన్నారు.