
వరంగల్ వాయిస్, దామెర : అన్నింటిలో కన్నా అన్నదానం గొప్పదనీ కాంగ్రెస్ రేవూరి మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కు నాటి రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని ఊరుగొండ గ్రామంలో పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. ముందుగా గణపతి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ… అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని, వినాయకుడి ఆశీస్సులు పరకాల ఎమ్మెల్యే పై ఉండాలని దేవుని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భూపతి రమేష్,సభ్యులు వేల్పుల మధుకర్, కోల రాజు, గొల్లపల్లి వీరయ్య, జన్ను రాజు, ఉప్పుల రవి, చిట్ల సదానందం,ఓదెల కరుణాకర్, చెట్టుపల్లి మధుకర్, గౌడ గాని మహేందర్, లక్కిడి రవీందర్ రెడ్డి,మనోజ్, పవన్, నల్ల సాంబయ్య, దామెర మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కందికొండ సంపత్ తదితరులు పాల్గొన్నారు.