
మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు సంతాపం!
వరంగల్ వాయిస్, హనుమకొండ :ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రఖ్యాత ఆచార్యులు తాడికొండ వెంకటరాజయ్య మరణ వార్త తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు వన్నాల శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గడించిన యోగ వ్యక్తిత్వ వికాస నిపుణులు, సామాజిక ఉద్యమకారులు,రచయిత ప్రజాజీవన పోరాటం కోసం అంకితమవుతున్న ఆచార్య వెంకట రాజయ్య హఠాన్మరణం పట్ల వన్నాల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.బహుముఖ ప్రజ్ఞాశాలి,బహుజన సమాజ ఆస్తి తెలంగాణలో ఆయన భూమిక విస్తారం పద్మశాలి సమూహం ప్రయోజనాలకు పెట్టని కోట ఆచార్య తాడికొండ వెంకటరాజయ్య అని వన్నాల కొనియాడారు.జనగామ జిల్లాలో ఆయన సేవలు మరువలేనివి, వెంకటరాజయ్య అస్తమయం తెలంగాణ భవిష్యత్తు బహుజన సామాజిక ఉద్యమాలకు తీరని లోటని వన్నాల అన్నారు. వెంకటరాజయ్య నిష్క్రమరణం నాకు తీవ్ర ఆవేదన కలిగించిందని,ఆయన కుటుంబానికి మనోధైర్యం కలిగించి ఆయన ఆశయాలు నెరవేరాలని వన్నాల ఆకాంక్షించారు.మృతుడు వెంకట రాజయ్య కుటుంబ సభ్యులకు వన్నాల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్వర్గీయ వెంకటరాజయ్య ఏ లోకంలో ఉన్న వారి ఆత్మ శాంతించాలని వన్నాల కోరారు.