
వరంగల్ వాయిస్,హైదరాబాద్ :రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని రాష్ట్ర అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టారు.ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ తనకు సొంత సోదరి లాగా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆప్యాయతను వ్యక్తం చేశారు.అన్న చెల్లెళ్ల,అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని చాటే రాఖీ పండుగ ప్రతి ఒక్కరు ఆనందోత్సావాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
