
వరంగల్ వాయిస్,హనుమకొండ : కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేవ పథకాలలో భాగంగా వరంగల్ పోలీస్ కమీషనరేట్ టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం లభించింది. ఈ సందర్బంగా పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు పోలీస్ ఉన్నతాధికారులు,బంధుమిత్రులు,పలువురు శుభాకాంక్షలు తెలిపారు.