
ఏసీ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభోత్సవం
- కేయూసీ రోడ్ మిర్యాల్‌కార్ కాంప్లెక్స్‌లో సందడి
- మేనేజింగ్ డైరెక్టర్ ఐలాపురం వేణుచారికి ప్రముఖుల అభినందనలు
- ఈనెల 10 వరకు బై వన్ గెట్ వన్ బంపర్ ఆఫర్
వరంగల్ వాయిస్, హనుమకొండ :హనుమకొండ పెద్దమ్మగడ్డ- కేయూసీ రోడ్‌లోని కొత్తూర్ మిర్యాల్‌కార్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నేచర్ 369 ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం కన్నులపండుగగా జరిగింది. సోమవారం ఉదయం నగర కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, తోట వెంకన్న, చెన్నం మధు, బొంగు అశోక్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ మిర్యాల్‌కార్ దేవేందర్ హాజరై లాంచనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నగర ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన వంటకాలను అందించాలని, ప్రముఖ హోటళ్ల సరసన రెస్టారెంట్ నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా రెస్టారెంట్ ఓనర్ ఐలాపురం వేణుచారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వేణుచారి… అతిథులను శాలువాలతో సత్కరించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన సీనియర్ జర్నలిస్టులు పల్లె రవి వంశీ మోహన్, చేలిక రాజేంద్ర ప్రసాద్, ముల్క రవి, సర్వేష్ దూదికట్ల, సలేంద్ర రవీంద్రచారి, గుంపెల్లి గౌతం, సిద్దోజు రాకేష్, గోలి రవి, రామాచారి, నరేష్ ద్రావిడ్ తదితరులు వేణుచారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ యూత్ నాయకులు నారాయణగిరి రాజు చారి, పెద్దోజు వెంకటచారి, షణ్ముఖాచారి, కోటిలింగం, 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్రవంతి, రెస్టారెంట్ నిర్వాహకులు విజేందర్, యుగేందర్, మనోహర్‌దాస్, క్రాంతి, నితిన్, దేవేందర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
బై వన్ గెట్ వన్ ఆఫర్…
నేచర్ 369 రెస్టారెంట్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ఈనెల 4వ తేదీ నుంచి 10 వరకు సింగిల్ చికెన్ బిర్యానికి మరో సింగిల్ బిర్యాని ( బై వన్ గెట్ వన్) ఉచితంగా అందజేయనున్నట్లు ఓనర్ ఐలాపురం వేణుచారి తెలిపారు. సరసమైన ధరలకే శుచి, శుభ్రతతోపాటు నాణ్యమైన వెజ్, నాన్ వెజ్ వంటకాలను
అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్డర్లపై బిర్యానీ అందించడమేగాక.. క్యాటరింగ్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. నగర ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వేణుచారి కోరారు.

