Warangalvoice

బీజేపీదే అధికారం

  • రాష్ర్ట అధ్యక్షులు రాంచందర్ రావు
  • పార్టీలో చేరిన యువ నాయకుడు నరేష్ నాయక్

వరంగల్ వాయిస్, డోర్నకల్ : డోర్నకల్ మండల యువ నాయకుడు ధరావత్ నరేష్ నాయక్ బీజేపీలో చేరారు. డోర్నకల్ మండల కేంద్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి మహబుబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగన పార్టీ సమావేశంలో ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షులు రాంచందర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు కషాయం కండువ కప్పి ఆవ్వానించారు. ఆయనతో పాటు మాజీ డీఆర్యూసీసీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు మైను పాషా కూడ బీజేపీలో చేరారు. మోడి నాయకత్వంలో తెలంగాణలో అధికారం చేప్పటబోతున్నామని రాంచందర్ రావు ఉద్ఘాటించారు. ముఖ్యంగా యువతకు సముచిత స్థానం కల్పిస్తామని హామి ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మానుకోట ప్రాంత ప్రజలు బీజేపీని ఆదరించి అత్యధిక సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు మున్సిపల్ చైర్మన్ స్థానాలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లభు వెంకటేశ్వర్లు, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, క్రమశిక్షణ సంఘం రాష్ర్ట చైర్మన్ మార్తినేని ధర్మరావు, మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్, ఎడ్ల అశోక్ రెడ్డి, యాప సీతయ్య, వైవీ రావు, మహేష్, జిల్లా కౌన్సిల్ సభ్యలు లక్ష్మీనారాయణ వ్యాస్, రాయల రాంబాబు, మైనార్టీ జిల్లా ఆధ్యక్షులు రహెమాన్, మండలాధ్యక్షులు గణేష్ నాయక్, బాసాని నణేష్, పవన్ కళ్యాణ్, హనుమంతు, రవి, కడవాండ్ల వెంకన్న, అశోక్, సురేష్, రమా, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *