ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం
అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, సదయ్య
వరంగల్ వాయిస్, హనుమకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు, వారి కుటుంబాలకు ఇన్స్యూరెన్స్ చేయించి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య తెలిపారు. గురువారం ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రమాద బీమా నమోదు ప్రారంభ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. అనేక కారణాల వల్ల హమీల అమలు కొంత ఆలస్యమైందన్నారు. ఆర్థిక పరమైన విషయాలు, ఇన్స్యూరెన్స్ కంపెనీలతో చర్చించటం, కమిటీలో ఏకాభిప్రాయం రావటం ఇలాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవటంతో ఆలస్యం జరిగిందని వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం చేస్తున్న ఇన్స్యూరెన్స్ కు అదనంగా సహజ మరణానికి కూడా వర్తించేలా మరో ప్రత్యేక పాలసీ కోసం కమిటీలో చర్చించి ప్రకటన చేస్తామన్నారు. ఒకరిద్దరు సభ్యత్వం లేని వ్యక్తులు తమ కమిటీపై బురదజల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాము పట్టించుకోబోమని, హద్దు దాటి ప్రవర్తిస్తే వారికి కర్రుకాల్చివాత పెట్టేందుకు కలసిరావాలని కోరారు. ప్రెస్ క్లబ్ సభ్యులకు మేలు చేసే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి లక్ష్మణ్ రావు సభ్యులకు పాలసీ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల బాధ్యులు గాడిపెల్లి మధు, వల్లాల వెంకటరమణ, తోట సుధాకర్, కంకణాల సంతోష్, పెండెం వేణుమాధవ్, కోరుకొప్పుల నరేందర్, మట్ట దుర్గాప్రసాద్, గడ్డం కేశవమూర్తి, బుచ్చిరెడ్డి, రవీందర్ రెడ్డి, సంగోజు రవి, సామల సూర్యప్రకాశ్, రాజేంద్రప్రసాద్, రాజేశ్వర్ రావు, రవి, రాజేందర్, మెండు రవీందర్, షఫీ, నాగరాజు, చెరుకు వేణుప్రసాద్, బండి పర్వతాలు, విజయ్ కుమార్, హరి, శ్రీధర్, సాల్మన్, వేముల సదానందం, కక్కెర్ల అనిల్ కుమార్, దాసరి ధనుంజయ్, పాషా, ప్రసాదరెడ్డి, రాజు, ప్రెస్ క్లబ్ బాధ్యులు గోకారపు శ్యాం, బొడిగె శ్రీను, కొడిపెల్లి దుర్గాప్రసాదరావు, పొడిచెట్టి విష్ణువర్థన్, బూర్ల నరేందర్, వలిశెట్టి సుధాకర్, వీరగోని హరీష్, ఎండీ నయీంపాషా, బాలవారి విజయ్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.