
వరంగల్ వాయిస్, పరకాల : గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో పోచంపల్లి ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఆదివారం పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ లో మహిళలకు కుట్టు మిషన్లు,కేసీఆర్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పరకాల, నడికుడ మండలాలకు చెందిన మహిళలకు కుట్టు మిషన్లు,కేసీఆర్ కిట్లను అందచేశారు.అనంతరం పరకాల మండలంలోని నాగారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.అదేవిధంగా మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ లేజీస్లటివ్ కౌన్సిల్ మెంబెర్ బండప్రకాష్,మాజీ ఎమ్మెల్యే లు గండ్ర వెంకటరమణ రెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి,రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి,మాజీ చైర్మన్ లు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



