
వరంగల్ వాయిస్, సుబేదారి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తాడిచర్ల మండలానికి చెందిన ఉల్లిగంటి సంపత్ కుమార్తె, 9 సంవత్సరాల శ్రీ నిత్య, హనుమకొండ హంటర్‌రోడ్‌లోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 5వ తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిత్య హాస్టల్ నుంచి అకస్మాత్తుగా బయటకు వెళ్లిపోయింది. అదే హాస్టల్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బైరి ఉమా బాలిక కనిపించడం లేదని గుర్తించి ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సుబేదారి ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ కు తెలియజేశారు. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ తన సిబ్బందితో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించగా, బాలిక పద్మాక్షమ్మ గుట్ట దగ్గర ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు నిత్యను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా శ్రీ నిత్య తల్లిదండ్రులు సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.