Warangalvoice

బాబా గుడిలో భక్తజనం

  • గురు పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు
  • శేజ హారతితో ముగిసిన పూజా కార్యక్రమాలు

వరంగల్ వాయిస్, హనుమకొండ : మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి మనకు తోడు, నీడై నిలిచి మనల్ని సన్మార్గంలో నడిపించే గురువులను పూజించి వారిని గౌరవించుకునే రోజే ‘గురు పౌర్ణమి’ అని హనుమకొండలోని సాయిబాబా మందిర చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ అన్నారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పూజారులు కిషోర్ శర్మ, మణిశర్మ, చందులు మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని తల్లిదండ్రులతో కలిసి బాబా దర్శనం చేసుకున్నారు. ఆమెకు మందిర చైర్మన్ శేష వస్త్రాలలు అందజేసి ఘనంగా సత్కరించారు. నగర ట్రాఫిక్ ఏసీపీ తీర్థాల సత్యనారాయణ, సుబేదారి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముఖ్య దాతలుగా తుంగతుర్తి శేషగిరిరావు-వరలక్ష్మి దంపతులు వ్యవహరించారు. మందిరంలో భక్తులకు మహా అన్నదాన ప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం జరిగిన పల్లకి సేవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాధునికి జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాలను మందిర ధర్మకర్తలు నిమ్మల శ్రీనివాస్, రాకం సదానందం, వెయ్యిగండ్ల రమేష్, పూస సురేష్ కుమార్ లు పర్యవేక్షించారు. రాత్రి 9.30 గంటలకు నిర్వహించిన శేజ హారతితో కార్యక్రమాలు ముగిశాయి.

గిర్మాజీపేటలో గురు పౌర్ణమి

వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : నగరంలోని 27వ డివిజన్ గిర్మాజిపేటలో గురువారం జిట్టేడు హనుమాన్ దేవాలయంలో గురుపౌర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, మాజీ కార్పొరేటర్ జారతి రమేష్, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు తోట సంపత్ కుమార్, మిట్టపల్లి సంజయ్ తదితరులు జిట్టేడు హనుమాన్ దేవాలయంలోని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గర్నేపల్లి సుధాకర్, మురళి, హరి, వెంకటేశ్వర్లు, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

girmazipet saibaba temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *