Warangalvoice

విూతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అదృష్టం

వార్‌-2 మూవీపై కియారా ఆసక్తికర పోస్ట్‌
వరంగల్ వాయిస్, (సినిమా): ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న చిత్రాల్లో ’వార్‌ 2’ఒకటి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ (కి) ప్రధాన పాత్రల్లో నటించారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా కనిపించనున్నారు. తాజాగా ఆమె ఈ సినిమాపై పోస్ట్‌ పెట్టారు. ప్రపంచం దీన్ని ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు- తెలుపుతూ తారక్‌, హృతిక్‌లు పోస్ట్‌లు పెట్టారు. అందులో హృతిక్‌ పోస్ట్‌ను షేర్‌ చేసిన కియారా..ఈ సినిమా విషయంలో విూరెంత ఆసక్తిగా ఉన్నారో నేనూ అలానే ఉన్నాను. విూతో కలిసి స్కీన్ర్‌ షేర్‌ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఎన్టీఆర్‌తో కలిసి అయాన్‌ ముఖర్జీ సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని ఎదురుచూస్తున్నాను. మన టీ-మ్‌ మొత్తం ఈ సినిమాకు ప్రాణం పోసిందని రాసుకొచ్చారు. ఇటీవల ఈ సినిమాపై పోస్ట్‌ పెట్టిన ఎన్టీఆర్‌.. హృతిక్‌ ఎనర్జీ తననెంతో ఆకర్షించిందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు- చెప్పారు. ’వార్‌ 2’తో అయాన్‌ ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్‌ సిద్ధం చేశారంటూ అభిమానుల్లో జోష్‌ నింపారు. హిట్‌ మూవీ ’వార్‌’కు సీక్వెల్‌ రూపొందిన స్పై థ్రిల్లర్‌ సినిమా ఇది. భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను ప్రకటించిన నాటినుంచి ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *