
వరంగల్ వాయిస్, ఎల్కతుర్తి: నిన్న విడుదల చేసిన 10 వ తరగతి ఫలితాలలో ఎల్లాపూర్ శివారులోని ఆర్బిట్ ఇ- టెక్నో స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని ప్రిన్సిపల్ & కరస్పాండెంట్ శ్రీ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు.పదో తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులలో ఎం. వినీల్ రెడ్డి 581, టి. సంజనా రెడ్డి 580, ఏ. విశాల్ రెడ్డి 573 మార్కులు సాధించారు. అలాగే 120 మంది విద్యార్థులలో 90 మార్కులు కి పైగా సాధించిన విద్యార్థుల వివరాలు ఇంగ్లీషులో 69 మంది, సైన్స్ లో 64 మంది, మ్యాథమెటిక్స్ లో 48 మంది, సోషల్ లో 41మంది, తెలుగులో 30 మంది,హిందీలో 14 మంది విద్యార్థినీ, విద్యార్థులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ & కరస్పాండెంట్ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి , డైరెక్టర్ హారిక -భగవాన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ, విద్యార్థులను అభినందించారు.